- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Reliance Jio: జియో భారీ ఆఫర్.. జెమిని ఫీచర్లతో 18 నెలలు ఉచితంగా గూగుల్ ఏఐ ప్రో యాక్సెస్
రూ. 35,100 విలువైన గూగుల్ ఏఐ ప్రో ప్లాన్, జెమిని యాప్‌లోని జెమిని 2.5 ప్రో మోడల్‌ను జియో కస్టమర్లకు ఉచితంగా అందిస్తాయి

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మార్కెట్లో గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, దేశీయ రిలయన్స్ సంస్థలు తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా, రెండు కంపెనీలు భారీ గుడ్‌న్యూస్ ప్రకటించాయి. రూ. 35,100 విలువైన గూగుల్ ఏఐ ప్రో ప్లాన్, జెమిని యాప్‌లోని జెమిని 2.5 ప్రో మోడల్‌ను జియో కస్టమర్లకు 18 నెలల పాటు ఉచితంగా అందిస్తాయి. అక్టోబర్ 30 నుంచి ఈ ఉచిత ప్లాన్ అమల్లోకి వస్తుందని, మొదట దీన్ని 18-25 ఏళ్ల వయసున్న కస్టమర్లకు ఇవ్వనున్నట్టు ఇరు సంస్థలు పేర్కొన్నాయి. అయితే, అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత దశలవారీగా మిగిలిన కస్టమర్లకూ విస్తరిస్తామని స్పష్టం చేశాయి. గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ ద్వారా జియో యూజర్లు జెమిని యాప్‌లో గూగుల్ జెమిని 2.5 ప్రో ఏఐ మోడల్‌కు యాక్సెస్ పొందుతారు. 2టీబీ క్లౌడ్ స్టోరేజీ, వియో 3.1 విడియో జనరేటర్, నానో బనాన ఇమేజ్ జనరేషన్ లాంటి ఫీచర్లు లభిస్తాయి. అంతేకాకుండా జెమిని కోడ్ అసిస్ట్, నోట్‌బుక్ ఎల్ఎం, జీమెయిల్, డాక్స్‌లో జెమిని సేవలు అందుతాయి. 2టీబీ క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ ద్వారా యూజర్లు ఆండ్రాయిడ్‌లో గూగుల్ ఫోటోస్, జీమెయిల్, గూగుల్ డ్రైవ్, వాట్సాప్ చాట్‌ల బ్యాకప్ కోసం ఉపయోగించవచ్చు. యూజర్లు తమ ఫోన్‌లలోని మైజియో యాప్ నుంచి గూగుల్ ఏఐ ప్రో ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.






