Reliance: ఏడాది ఆఖరు కల్లా రిలయన్స్ సోలార్ మాడ్యూల్ ఫ్యాక్టరీ ప్రారంభం

by S Gopi |

క్లీన్ ఎనర్జీ అవసరాలను కోసం మూడు పెద్ద ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నామని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ పార్థా ఎస్ మైత్రా అన్నారు.

Reliance: ఏడాది ఆఖరు కల్లా రిలయన్స్ సోలార్ మాడ్యూల్ ఫ్యాక్టరీ ప్రారంభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది తన సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ గురువారం ప్రకటనలో తెలిపారు. క్లీన్ ఎనర్జీ అవసరాలను కోసం మాడ్యూల్స్ ఉత్పత్తి చేయడానికి మూడు పెద్ద ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్ట్రాటజీ, ఇనిషియేటివ్ హెడ్ పార్థా ఎస్ మైత్రా అన్నారు. గతేడాది కాలంగా దేశంలో సోలార్ రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే, 2030 నాటికి 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించడానికి రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని గ్లోబల్ ఎనర్జీ మానిటర్ నివేదిక తెలిపింది. ఇందులో భాగంగానే రిలయన్స్ ఈ ఏడాది ఆఖరు నాటికి 20 గిగావాట్లకు సోలార్ మాడ్యూల్ సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని మైత్రా వివరించారు. అలాగే, బ్యాటరీ, మైక్రో-పవర్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని వెల్లడించారు. అనుకున్న ప్రకారం పనులు పూర్తయితే భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సోలార్ పీవీ ఉత్పత్తిదారు అవుతుంది. మొత్తం సౌర పీవీ మాడ్యూళ్లలో దాదాపు 14 శాతంతో చైనా తర్వాత అత్యధిక ఉత్పత్తి సాధించగలమని కంపెనీ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు.

Next Story