- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Reliance: ప్రపంచంలోనే రెండో ఉత్తమ బ్రాండ్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్
భారత్ నుంచి ర్యాంకు సాధించిన ఏకైన కంపెనీగా రిలయన్స్ నిలిచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే రెండో ఉత్తమ బ్రాండ్‌గా స్థానం దక్కించుకుంది. 2024 ఏడాదికి గానూ ప్రముఖ ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్ విడుదల చేసిన ఈ జాబితాలో యాపిల్, నైకీల కంటే మెరుగైన, భారత్ నుంచి ర్యాంకు సాధించిన ఏకైన కంపెనీగా రిలయన్స్ నిలిచింది. ఫ్యూచర్‌బ్రాండ్ సంస్థ అంతర్జాతీయంగా జరిగే మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, కంపెనీ బ్రాండ్ ప్రయోజనాలను కాపాడుకోవడం వంటి అంశాల ఆధారనంగా ర్యాంకులను కేటాయిస్తుంది. ఇందులో దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ అగ్రస్థానంలో నిలవగా, 2023లో ఐదో స్థానంలో ఉంది. 2023లో 13వ స్థానంలో ఉన్న రిలయన్స్ సంస్థ ఏడాది కాలంలో ఏకంగా 11 స్థానాలు ఎగబాకడం విశేషం. ప్రధానంగా యాపిల్, నైకీ, వాల్ట్ డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టయోటా లాంటి గ్లోబల్ స్థాయి కంపెనీలను అధిగమించి రిలయన్స్ ముందువరుసలో నిలిచింది. యాపిల్ సంస్థ 2023 నాటి ర్యాంకింగ్స్ అగ్రస్థానం సాధించగా, ఈసారి మూడో ర్యాంకుతో సరిపెట్టుకుంది. యాపిల్ తర్వాత నైకీ, నెదర్లాండ్స్‌కు చెందిన ఏఎస్ఎంఎల్ సెమీ కండక్టర్స్, అమెరికాకే చెందిన డెన్‌హర్ కార్పొరేషన్, వాల్ట్‌డిస్నీ కంపెనీలు ఉన్నాయి.






