- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jiohotstar: ఎట్టకేలకు జియోహాట్‌స్టార్ డొమైన్ సొంతం చేసుకున్న రిలయన్స్
దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ వయాకామ్18 మీడియా ఎట్టకేలకు జియోహాట్‌స్టార్ డొమైన్‌ను సొంతం చేసుకుంది. గత కొన్ని నెలలుగా చట్టపరమైన, వాణిజ్య వివాదంలో ఉన్న ఈ డొమైన్ అంశం ముగిసింది. తాజా రికార్డుల ప్రకారం, వయాకామ్18 సీనియర్ డైరెక్టర్ మనీష్ పైనులీ పేరుమీద డొమైన్ నమోదు చేయబడింది. మహారాష్ట్రలోని ముంబైలో ప్రధాన కార్యాలయం ఉన్న వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కింద డొమైన్ రిజిస్టర్ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.
ఢిల్లీ-టూ-దుబాయ్-టూ-ముంబై..
వాస్తవానికి మొదట జియోహాట్‌స్టార్ డొమైన్ ఢిల్లీకి చెందిన ఇంజనీర్, యాప్ డెవలపర్ కొనుగోలు చేశాడు. అతను అమెరికాలోని యూనివర్శిటీలో డిగ్రీ కోసం ట్యూషన్ ఫీజును రిలయన్స్ చెల్లిస్తే డొమైన్ విక్రయిస్తానని చెప్పాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమయంలోనే డొమైన్ హక్కులను యూఏఈకి చెందిన జైనం, జీవిక అనే తోబుట్టువులు సొంతం చేసుకున్నారు. దీనిపై సరైన వివరాలు బహిర్గతం అయ్యేలోపు వారిద్దరూ రిలయన్స్ లీగల్ టీమ్‌కు ఉచితంగా డొమైన్‌ను అందించినట్టు తెలుస్తోంది. డొమైన్‌ను రిలయన్స్‌కు ప్రయోజనం కలిగిస్తుందనే ఆశతో స్వచ్ఛందంగా వారు హక్కులు ఇచ్చినట్టు సమాచారం.