Jio: 5జీ కంటే ఫుల్‌ స్పీడ్‌.. జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్తగా 5.5జీ వచ్చేసింది!

by Bhoopathi Nagaiah |

Jio 5G: కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది రిలయన్స్ జియో. ఇప్పటికీ పూర్తిగా 5జీ సేవలు అందుబాటులోకి రాకముందే ఇప్పుడు 5.5 జీ నెట్ వర్క్ సర్వీస్ ను స్టార్ చేసింది. 5జీకి , 5.5 జీకి మధ్య తేడా ఏంటి? 5.5జీ సర్వీసులు ఏ ఫోన్లో దొరుకుతాయో తెలుసుకుందాం.

Jio: 5జీ కంటే ఫుల్‌ స్పీడ్‌.. జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కొత్తగా 5.5జీ వచ్చేసింది!
X

దిశ, వెబ్‌డెస్క్: రియలన్స్ జియో మరింత అప్ గ్రేడ్ అవుతోంది. జెట్ స్పీడ్ దూసుకుపోతూ తన కస్టమర్లకు మరిన్ని సేవలను అందిస్తోంది. బీఎస్ఎల్ తోపాటు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా సర్వీసులు అందిస్తున్నాయి. అయినప్పటికీ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు టారీఫ్ ధరలను పెంచినప్పటికీ తమ కస్టమర్లకు మెరుగైన నెట్ వర్క్ సేవలను అందిస్తున్నాయి.

అయితే జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలు ఇప్పటి వరకు 3జీ, 4జీలు దాటి 5జీ సేవలను కూడా అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 4జీ సేవలు దేశ వ్యాప్తంగా చేస్తూ కొన్ని ముఖ్యమైన నగరాల్లో మాత్రమే 5 సర్వీసులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ జియో పోటీ కంపెనీ ల కంటే ఓ అడుగు ముందుకేసింది. 5.5 జీ నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

5.5జీ నెట్ వర్క్ అంటే ఏమిటి?ఎలా పనిచేస్తుంది?

జియో 5జీ సర్వీస్ కు అప్ గ్రేడ్ వెర్షన్ ఈ 5.5జీ నెట్ వర్క్. సాధారణ 5 జీతూ పోల్చితే ఇది మరింత స్పీడ్ గా ఇంటర్నెట్ సిగ్నల్స్ ను అందిస్తుంది. మెరుగైన, రిలయబుల్ నెట్ వర్క్ ను అందిస్తుంది. ఈ వ్యవస్థ మూడు స్పెషల్ నెట్ వర్క్ సెల్స్ ను ఉపయోగిస్తుంది. అవి ఒకేసారి ఎక్కువ టవర్స్ కు కనెక్ట్ అవుతాయి. కాబట్టి కస్టమర్లు 1జీబీపీఎస్ నుంచి 10జీబీపీఎస్ వరకు ఇంటర్నేట్ స్పీడ్ తో వీడియోలు, మూవీస్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇక జియోతో కలిసి ప్రారంభమైన వన్ ప్లస్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో ఈ 5.5 జీ నెట్ వర్క్ సర్వీసులను మీరు పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్స్ జియో అత్యాధునిక నెట్ వర్క్ టెక్నాలజీతో పనిచేసేలా డిజైన్ చేశాయి. కాబట్టి ఈ 5.5 జీ సర్వీసు ఈ ఫోన్లు మాత్రమే సపోర్టు చేస్తాయి.

ప్రయోజనాలు :

జియో 5.5G నెట్‌వర్క్‌లో మల్టీ-సెల్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. దీనితో పరికరాలు మల్టిపుల్ నెట్‌వర్క్ సెల్‌లకు ఏకకాలంలో కనెక్ట్ చేసుకుంటాయి. వీటిని వివిధ టవర్లలో కూడా అనుసంధానించవచ్చు. ఇది వేగవంతమైన డేటా ట్రాన్స్ ఫర్ తోపాటు మెరుగైన కాల్ క్వాలిటీని అందిస్తుంది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో మంచి నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. వైర్‌లెస్ నెట్‌వర్క్‌లను మెరుగుపరచగలగడం వల్ల 5.5G పారిశ్రామిక వినియోగానికి కూడా మంచిది.

Next Story