సూపర్ న్యూస్.. రూ.15 వేలకే ల్యాప్‌టాప్

by Disha Web Desk 2 |
సూపర్ న్యూస్.. రూ.15 వేలకే ల్యాప్‌టాప్
X

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం రంగంలో రిలయన్స్ సంస్థ సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. జియో ప్రారంభించిన నాటి నుంచి అన్నీ సంచలనాలు, రికార్డులే. 2016లో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియో మూడేళ్లలోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. 30 కోట్లకు పైగా యూజర్లతో అరుదైన ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. తాజాగా.. నిరుద్యోగులు, యువత, ఉద్యోగస్తులకు సూపర్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే జియో బుక్‌, జియో బుక్‌ 4జీ పేరు రెండు ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చిన జియో ఇప్పుడు మరో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గతంలో విడుదల చేసిన జియో బుక్‌ 4జీ ధర రూ. 16,000గా ఉండగా, ఇప్పుడు తీసుకొచ్చే జియో క్లౌడ్‌ పీసీని కేవలం రూ. 15,000కే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

జియో క్లౌడ్‌ పీసీ పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకురానుంది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు గాను ప్రముఖ ల్యాప్‌టాప్‌ తయారీ సంస్థలైన హెచ్‌పీ, లెనోవా, ఏసర్‌లతో చర్చలు జరుపుతోంది. ఈ విషయమై కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘ల్యాప్‌టాప్ ధరను అందులోని స్టోరేజ్‌, ప్రాసెసర్‌, చిప్‌సెట్‌, బ్యాటరీతోపాటు ఇతర హార్డ్‌వేర్‌ భాగాల ఆధారంగా నిర్ణయిస్తారు. వీటి ధర పెరిగితే దాని ప్రభావం తప్పక ల్యాప్‌టాప్‌ ధరపై ఉంటుంది. దీన్ని తగ్గించేందుకు జియో క్లౌడ్‌ పీసీని తీసుకొస్తున్నాం. ఇందులో సిస్టమ్‌ ప్రాసెసింగ్ మొత్తం జియో క్లౌడ్‌లో జరుగుతుంది. దీనివల్ల తక్కువ ధరకే వినియోగదారులకు ల్యాప్‌టాప్‌ అందుబాటులోకి వస్తుంది’ అని చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed