దేశ వ్యాప్తంగా LPG కొర‌త‌..రిలయన్స్ ఇండస్ట్రీస్ కీల‌క నిర్ణ‌యం

by velandi.Saikiran |

గ్లోబల్ ఇంధన మార్కెట్స్ లో అస్థిరత ఉన్న తరుణంలో ఎల్పీజీ ఉత్పత్తి పెంచుతున్నట్లు ప్రకటన చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్.

Reliance boosts LPG production amid global crisis
X

Reliance boosts LPG production amid global crisis

దిశ‌, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఇండియాలో చమురు కొరత స్పష్టంగా కనిపిస్తోంది. హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా ఆగిపోయిన నేపథ్యంలో ఇండియాకు దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. దీనివల్ల తాత్కాలికంగా ఇండియాలో చమరు కొరత ఏర్పడింది. అంతేకాదు భారత దేశ వ్యాప్తంగా LPG కొరత కూడా క్రమ క్రమంగా పెరుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ ఇంధన మార్కెట్స్ లో అస్థిరత ఉన్న తరుణంలో ఎల్పీజీ ఉత్పత్తి పెంచుతున్నట్లు తాజాగా ప్రకటన చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్.

ఎల్పీజీ ఉత్ప‌త్తి పెంచుతున్న‌ట్లు రిల‌య‌న్స్ ప్ర‌క‌ట‌న‌

భారతదేశ ప్రజలకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించింది రిల‌య‌న్స్. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను పాటిస్తూ జామ్ నగర్ లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ హబ్ లో ఎల్పీజీ ఉత్పత్తిని ( LPG production) పెంచబోతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. భారతీయ ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని మరోసారి గుర్తు చేసింది రిలయన్స్. భారతదేశ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటామని తెలిపింది.

కరోనా సమయంలో కూడా రిలయన్స్ ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. ఇక ఇప్పుడు యుద్ధం కారణంగా తలెత్తిన ఎల్పీజీ కొరత సమస్యకు చెక్ పెట్టేందుకు రిలయన్స్ ( Reliance) ముందడుగు వేసింది. అదే సమయంలో ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన తాజాగా కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా 10% గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని కేంద్ర కేబినెట్ స్పష్టం చేసింది. క్లిక్

Next Story