Post Office RD: పోస్టాఫీస్‌, బ్యాంకుల్లో అదిరే పథకం ఇది.. రోజుకు వంద రూపాయలు కడితే చాలు.. 2లక్షలు సంపాదించవచ్చు

by Vennela |

Post Office RD: రికరింగ్ డిపాజిట్(Recurring Deposit) అనేది దేశంలో ఒక ప్రత్యేక రకమైన టర్మ్ డిపాజిట్.

Post Office RD: పోస్టాఫీస్‌, బ్యాంకుల్లో అదిరే పథకం ఇది.. రోజుకు వంద రూపాయలు కడితే చాలు.. 2లక్షలు సంపాదించవచ్చు
X

దిశ, వెబ్ డెస్క్: Post Office RD: రికరింగ్ డిపాజిట్(Recurring Deposit) అనేది దేశంలో ఒక ప్రత్యేక రకమైన టర్మ్ డిపాజిట్. దీన్ని భారతీయ బ్యాంకులు, ఇండియా పోస్ట్ అందిస్తున్నాయి. సాధారణ ఆదాయం ఉన్న వ్యక్తులు ప్రతి నెలా వారి రికరింగ్ డిపాజిట్ (Recurring Deposit)అకౌంట్లో స్థిరమొత్తాన్ని జమ చేయడాన్ని స్థిర డిపాజిట్ లకు వర్తించే రేటు వడ్డీని పొందడానికి దోహదపడుతుంది. ఇది నెలలవారీ వాయిదాల్లో ఒక నిర్దిష్ట మొత్తాన్ని స్థిర డిపాజిట్(Deposit) చేయడం వంటిది. రికరింగ్ డిపాజిట్ కనీస వ్యవధి ఆరు నెలలు కాగా గరిష్టంగా 10ఏళ్ల వరకు ఉంటుంది.

ఈ రికరింగ్ డిపాజిట్ (Recurring Deposit)ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్(Post Office) లో అనేక స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని రికరింగ్ డిపాజిట్(Recurring Deposit) స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో రోజుకు 100 రూపాయలు చొప్పున పొదుపు(Savings) చేస్తే అది క్రమమేనా లక్షల రూపాయలు పొందవచ్చు. ప్రతిరోజూ కేవలం 100 రూపాయలు ఆదాచేస్తే అది నెలకు రూ. 3000అవుతుంది. ఏడాదికి రూ. 36,000అవుతుంది. ఇలా 5ఏళ్లపాటు ఆదా చేస్తే మనం డిపాజిట్ (Deposit)చేసిన మొత్తం రూ. 1.80లక్షలు అవుతుంది. ఈ స్కీమ్ కింద కేంద్రం వార్షిక వడ్డీ రేటు 6.5శాతం అందిస్తుంది. 5ఏళ్లకు సుమారు రూ. 33వేలు వడ్డీని కూడా అందిస్తుంది. మొత్తం వడ్డీతో కలిపి 5 సంవత్సరాలకు రూ. 2.13లక్షలు పొందుతారు.

ఈ రికరింగ్ డిపాజిట్ ను 18ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న కానీ 60ఏళ్ల కంటే తక్కువ వయసున్న భారతీయ పౌరులు తీసుకోవచ్చు. మైనర్ రికరింగ్ డిపాజిట్లు (Recurring Deposit)18ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న మైనర్ల కోసం ఉంటాయి. ఈ ఆర్డీలను మైనర్ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుల సదుపాయంతో తీసుకోవచ్చు. ఈ అకౌంట్ ను తమ సమీపంలోని పోస్ట్ ఆఫీస్(Post Office) కు వెళ్లి తీసుకోవచ్చు. ఈ రికరింగ్ డిపాజిట్(Recurring Deposit) అకౌంట్ తీసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లు పాన్, ఆధార్, పాస్ పోర్టు లేదా ఓటర్ ఐడి వంటి గుర్తింపు కార్డులు ఉండాలి. ఆధార్, పాస్ పోర్టు, ఓటర్ ఐడి లేదా ఇటీవలి యుటిలిటీ బిల్లు వంటి అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. అకౌంట్ హోల్డర్ పాస్ ఫోటో తప్పనిసరిగా ఉండాలి. ఈ పత్రాలతో ఈ అకౌంట్ ను తీసుకోవచ్చు.

Next Story