జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. నవరాత్రుల్లో తొలిరోజున ఆ ఒక్క కంపెనీ నుంచే 30 వేల కార్ల అమ్మకాలు

by Naga Rani Yarlagadda |

జీఎస్టీ 2.0 సంస్కరణలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రాగా.. అనేక వస్తువుల ధరలు తగ్గాయి.

జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. నవరాత్రుల్లో తొలిరోజున ఆ ఒక్క కంపెనీ నుంచే 30 వేల కార్ల అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ 2.0 సంస్కరణలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రాగా.. అనేక వస్తువుల ధరలు తగ్గాయి. వాటిలో కార్లు, బైక్ లు కూడా ఉండటంతో కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తొలిరోజున మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా కంపెనీలు రికార్డుస్థాయిలో అమ్మకాలు జరిపాయి. జీఎస్టీ 2.0 రాయితీలు, పండుగ ఆఫర్లతో కొనుగోళ్లు పెరిగినట్లు ఆయా సంస్థలు తెలిపాయి.

మారుతీ సుజుకీ ఒక్కరోజులోనే 30 వేల కార్లను డెలివరీ చేయగా.. 80 వేల ఎంక్వైరీలు వచ్చినట్లు తెలిపింది. గడిచిన 35 ఏళ్లలో ఈస్థాయిలో రెస్పాన్స్ రావడం ఇదే తొలిసారి అని పేర్కొంది. అలాగే చిన్న కార్ల బుకింగ్ లు కూడా 50 శాతం పెరిగినట్లు చెప్పింది. ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ 11 వేల యూనిట్ల బిల్లింగ్స్ చేసినట్లు వెల్లడించింది. పండుగ సీజన్లో వినియోగదారుల ఉత్సాహం కనిపిస్తోందని, ఇది ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నట్లు ఎండీ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. ఇక టాటా సంస్థ తొలిరోజున 10 వేల కార్లను డెలివరీ చేయగా.. 25 వేల కస్టమర్ల ఎంక్వైరీలు వచ్చినట్లు చెప్పింది.

Next Story