- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FASTag pass: ఫాస్టాగ్ అవసరం లేదు...ఒక్కసారి రూ. 3 వేలతో రీచార్జ్ చేయిస్తే ఏడాదంతా ఫ్రీగా టోల్ పాస్ చేసే అవకాశం..?
FASTag pass: కేంద్ర రవాణా శాఖ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఇటీవల లైఫ్ టైం ఫాస్ట్ టాగ్ విధానం గురించి పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: FASTag pass: కేంద్ర రవాణా శాఖ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఇటీవల లైఫ్ టైం ఫాస్ట్ టాగ్ విధానం గురించి పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఫాస్ట్ ట్యాగ్ విధానం తో పాటు, తరచూ నేషనల్ హైవే ల పై ప్రయాణించే వాహనాలకు టోల్ ప్లాజా ల వద్ద ఖర్చు తగ్గించేందుకు ఫాస్ట్ టాగ్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఒకవేళ ఈ విధానం కనుక అమలులోకి వస్తే, అతి త్వరలోనే మీ ఫాస్ట్ ట్యాగ్ ని 15 ఇయర్స్ వరకు రీచార్జ్ చేసుకునే అవసరమే లేదు ఎన్ హెచ్ ఏ అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, త్వరలోనే ఒక సంవత్సరం నుంచి అండ్ 15 సంవత్సరాల రీచార్జ్ ప్లాన్స్ తెచ్చేందుకు సిద్ధం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ట్యాగ్ పాస్ లను ప్రవేశపెట్టనుంది. ఈ పాస్ లు ఒక సంవత్సరం వరకూ పనిచేయనున్నాయి. ఇందులో మినిమం రీచార్జ్ రూ.3000 ఉండే వీలుంది. ఈ రూ.3000 పెట్టి రీచార్జ్ చేస్తే నేషనల్ హైవేస్ పైన ఉన్న అన్ని టోల్ ప్లాజాస్ ని మీరు ఆ వన్ ఇయర్ లో అన్ లిమిటెడ్ సార్లు ప్రయాణం చేయొచ్చు, మళ్ళీ ఎలాంటి ఫాస్ట్ ట్యాగ్ రీచార్జ్ చేయాల్సిన అవసరం లేదు.
అంతే కాదు ఇందులో భాగంగా 15 సంవత్సరాలకు మీరు రూ.30,000 పెట్టి రీచార్జ్ చేసుకుంటే ఈ 15 ఏళ్ల పాటు అన్ లిమిటెడ్ సార్ల మీ వెహికల్ తోని నేషనల్ హైవేస్ పైన ఉన్నటువంటి అన్ని టోల్ ప్లాజాస్ ని హ్యాపీగా క్రాస్ చేయొచ్చు. త్వరలో గవర్నమెంట్ ఈ రూల్ ని అమలు చేయడానికి చూస్తోంది. ఈ రూల్ ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే రెగ్యులర్ గా ఫాస్ట్ టాగ్ రీచార్జ్ చేసే తలనొప్పి తగ్గుతుంది. అంతే కాకుండా నేషనల్ హైవేస్ పైన రెగ్యులర్ గా ఎవరైతే తిరుగుతుంటారో వాళ్ళకి ఫాస్ట్ టాగ్ ఖర్చులు కూడా తగ్గనున్నాయి. గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి ఈ కొత్త రూల్ వల్ల వాహనాలు ప్రతిసారి రీఛార్జ్ దెబ్బతో డబ్బులు ఖర్చు చేయాల్సిన పని తప్పుతుంది, ముఖ్యంగా ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు ఈ రూల్ ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంటుంది.






