- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Finance Ministry: జీఎస్టీ సంస్కరణలతో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం: ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక
అంతర్జాతీయ పరిణామాలు, వాణిజ్య సవాళ్లు, రిస్క్‌లను ఎప్పటికప్పుడు సమీక్షించాలి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవలి జీఎస్టీ రేటు కోతలు వచ్చే ఏడాది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడతాయని, దేశ వృద్ధి అవకాశాలకు మరింత సానుకూల అవకాశాలు ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నెలవారీ నివేదికలో పేర్కొంది. అయితే, అప్రమత్తంగా ఉండవలసిందే. అంతర్జాతీయ పరిణామాలు, వాణిజ్య సవాళ్లు, రిస్క్‌లను ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ప్రస్తుతానికి ఎదురవుతున్న రిస్క్‌లను ఎదుర్కోగల స్థాయిలోనే ఉన్నాయని నివేదిక అభిప్రాయపడింది. అమెరికా విధిస్తున్న టారిఫ్ అనిశ్చితులు కొనసాగితే, ఎగుమతి రంగాలపై ప్రభావం ఉంటుంది. దేశీయ ఉపాధి, ఆదాయం, వినియోగానికి ఈ పరిణామాలు ప్రభావితం చూపుతాయి. ఇదే సమయంలో కొత్తగా హెచ్1బీ వీసా రుసుమును పెంచాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం వాణిజ్య అనిశ్చితుల ప్రమాదాలను సూచిస్తుంది. హెచ్1బీ వీసాల ఫీజు పెంపు ఇప్పటివరకు ప్రభావితం కాని సేవల రంగాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలతో వాణిజ్య సవాళ్లను ఆర్థికవ్యవస్థకు దన్నుగా నిలుస్తాయని భావిస్తున్నట్టు నివేదిక పేర్కొంది.






