RBI: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేరున కొత్త రూ. 50 నోట్లు

by S Gopi |

త్వరలో కొత్త రూ. 50 నోట్లను సంజయ్ మల్హోత్ర పేరుతో ప్రింట్ అయిన వాటిని సర్క్యులేషన్‌లోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.

RBI: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేరున కొత్త రూ. 50 నోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.50 డినామినేషన్ నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ కార్యాలయం బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం చాలా నోట్లు మాజీ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ప్రింట్ అయ్యాయి. త్వరలో కొత్త రూ. 50 నోట్లను సంజయ్ మల్హోత్ర పేరుతో ప్రింట్ అయిన వాటిని సర్క్యులేషన్‌లోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. సంజయ్ మల్హోత్రా గతేడాది డిసెంబర్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో మహాత్మ గాంధీ సిరీస్‌లో కొత్త రూ. 50 నోట్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే వ్యవస్థలో చలామణి అవుతున్న పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Next Story