- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: త్వరలో కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ.10, రూ.500 నోట్ల జారీ
by S Gopi |
మహాత్మగాంధీ సిరీస్‌లో ఇప్పుడున్న నోట్ల తరహాలోనే కొత్తవి కూడా చలామణి అవుతాయని

X
దిశ, బిజినెస్ బ్యూర్: కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన కొత్త రూ. 10, రూ. 500 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటించింది. మహాత్మగాంధీ సిరీస్‌లో ఇప్పుడున్న నోట్ల తరహాలోనే కొత్తవి కూడా చలామణి అవుతాయని, ఇప్పటికే ఉన్న రూ. 10, రూ. 500 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన కొత్త రూ. 100, రూ. 200 నోట్లను జారీ చేయనున్నట్టు ఆర్‌బీఐ మార్చి నెలలో ప్రకటించింది. సంజయ్ మల్హోత్రా గతేడాది డిసెంబర్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు శక్తికాంత దాస్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలోకి వచ్చారు.
Next Story






