- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Denominations: ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరిన రూ. 500 నకిలీ నోట్లు
ఇదే సమయంలో గత ఆర్థిక సంవత్సరం రూ. 200 నోట్లలో కూడా నకిలీల సంఖ్య 13.9 శాతం పెరిగాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో నకిలీ నోట్లు పెరుగుతున్నాయి. గతంలో దొంగ నోట్లను నివారించడానికే ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. కానీ మళ్లీ వాటి బెడద తప్పేలా కనిపించడంలేదు. తాజా ఆర్‌బీఐ గణాంకాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులు గుర్తించిన నకిలీ నోట్లు 37.35 శాతం పెరిగి 1,17,722కి చేరాయి. ఇది 2019-20 నుంచి ఆరేళ్లలోనే అత్యధికం. 2023-24లో ఇవి 85,711 నకిలీ నోట్లను బ్యాంకు గుర్తించాయి. ఇదే సమయంలో గత ఆర్థిక సంవత్సరం రూ. 200 నోట్లలో కూడా నకిలీల సంఖ్య 13.9 శాతం పెరిగాయి. సంఖ్యా పరంగా 32,600 నోట్లు నకిలీలు ఉన్నాయి. రూ. 100 నోట్లలో కూడా నకిలీలు 23 శాతం పెరిగి 51,069కి చేరుకున్నాయి. మరోవైపు రూ. 2,000 నోట్లలో నకిలీవి 86.5 శాతం తగ్గి 3,508కి పరిమితమయ్యాయి. ఇది ఐదేళ్ల క్రితం ఉన్న 26,035 కంటే గణనీయంగా తగ్గాయి. ఆర్‌బీఐ ఇటీవల రూ. 2000 నోట్లను ఉపసంహరించుకోవడం వల్ల నకిలీ నోట్లు భారీగా క్షీణించాయి. 2023, మే 19న ఆర్‌బీఐ పెద్ద నేట్లను ఉపసంహరించుకునే నాటికి దేశంలో రూ. 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఇవి రూ. 6,266 కోట్లకు తగ్గాయి. ఇటీవల 98.24 శాతం రూ. 2,000 నోట్లు తిరిగొచ్చాయని ఆర్‌బీఐ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీనివల్లే ఈ నోట్లలో నకిలీల సంఖ్యలో క్షీణించాయి. 2024, నవంబర్ లోక్‌సభ సమావేశంలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరీ మాట్లాడుతూ.. మహాత్మ గాంధీ కొత్త సిరీస్ నకిలీ రూ. 500 నోట్ల సంఖ్య 85,711కు పెరిగాయని, ఇవి 2018-19లో ఉన్న 21,865 నుంచి గణనీయంగా పెరిగాయని చెప్పారు. 2024-25లో రూ. 500 నోట్లలో నకిలీల సంఖ్య పెరిగినప్పటికీ, మొత్తం దొంగ నోట్ల సంఖ్యలో తగ్గుదల నమోదైందని ఆర్‌బీఐ పేర్కొంది.






