RBI: 98.44 శాతం రూ. 2 వేల నోట్లు వెనక్కి: ఆర్‌బీఐ

by S Gopi |

ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఇంకా రూ.5,551 కోట్ల విలువైన పెద్ద నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది.

RBI: 98.44 శాతం రూ. 2 వేల నోట్లు వెనక్కి: ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: చలామణీలో ఉన్న 98.44 శాతం రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సోమవారం ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఇంకా రూ.5,551 కోట్ల విలువైన పెద్ద నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. 2023, మే 19న రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడే సమయానికి వ్యవస్థలో మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. ఈ నోట్లను ఆర్‌బీఐ చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ఎవరి వద్దనైనా ఆ నోట్లు ఉంటే ఆర్‌బీఐ కార్యాలయాల్లో డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. 2023, అక్టోబర్ 9వ తేదీ నుంచి ఆయా నోట్లను వ్యక్తులు, సంస్థలు ఆర్‌బీఐ ఆఫీసుల్లో అందజేస్తే, ఆ మొత్తాన్ని వారి అకౌంట్లలో డిపాజిట్‌ చేసే అవకాశం కల్పించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల నుంచి కూడా ప్రజలు తమ వద్ద రూ. 2,000 నోట్లను ఆర్‌బీఐకి పోస్టల్ రూపంలో పంపి, తమ అకౌంట్లలో క్రెడిట్‌ చేయించుకొనే వీలు కల్పించింది.

Next Story