- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ujjivan SFB: ఉజ్జీవన్ ఎస్ఎఫ్‌బీ దరఖాస్తును వెనక్కి పంపిన ఆర్‌బీఐ
బ్యాంకు తన లోన్ బుక్‌ను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్‌బీ) యూనివర్సల్ బ్యాంకుగా మారేందుకు ఇచ్చిన దరఖాస్తును సోమవారం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వెనక్కి పంపింది. అయితే, ఇది దరఖాస్తును రద్దు చేయడం కాదు, అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అందించే పూర్తి స్థాయి బ్యాంకుగా మారేందుకు అవసరమైన స్థాయిలో సిద్ధంగా లేనందున దరఖాస్తును తిరిగివ్వడం. బ్యాంకు తన లోన్ బుక్‌ను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. లోన్ పోర్ట్‌ఫోలియోను అన్ని విభాగాలకు విస్తరించిన తర్వాత దరఖాస్తును పరిగణలోకి తీసుకుంటామని సూచించింది. ప్రస్తుతం ఉజ్జీవన్ ఎస్ఎఫ్‌బీ ఇచ్చే రుణాలు ఇంకా పూర్తిగా అన్ని విభాగాల్లో లేవు. ఇప్పటికీ ఎక్కువ లోన్స్ ఒకే రకంగా ఉన్నాయి. ముఖ్యంగా అన్‌సెక్యూర్‌డ్ లోన్స్ వాటా అధికంగా ఉంది. యూనివర్సల్ బ్యాంక్ కావాలంటే, గృహ, వ్యాపార రుణాలు వంటి సెక్యూర్డ్ లోన్లు ఇంకా మెరుగుపడాలి. ప్రస్తుతం బ్యాంకు సెక్యూర్డ్ లోన్లు 43 శాతం నుంచి 49 శాతానికి పెరిగాయి. అన్‌సెక్యూర్డ్ లోన్లు క్రమంగా తగ్గుతున్నాయి. కానీ, సెక్యూర్డ్ లోన్స్ విభాగంలోని హోమ్, గోల్డ్, ప్రాపర్టీ లోన్లు పెంచాల్సి ఉంది. ఈ కారణంగానే ఆర్‌బీఐ మరింత మెరుగుపడిన తర్వాత యూనివర్సల్ బ్యాంకు హోదా కోసం దరఖాస్తు చేయాలని వెల్లడించింది.






