- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RBI: ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్, ఇండియా పోస్ట్ బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్‌బీఐ
రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో లోపాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో పాటు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులకు భారీ జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో లోపాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 'ఫ్లోటింగ్ రేట్ టర్మ్ లోన్‌లపై ఫోర్‌క్లోజర్ ఛార్జీలు/ముందస్తు చెల్లింపు పెనాల్టీ విధించడం, వ్యవసాయ రుణాలకు సంబంధించి క్రెడిట్ ఫ్లో ఆదేశాలను పాటించనందుకు రూ.65 లక్షల జరిమానా విధించారు. అలాగే, 'బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్'పై కొన్ని ఆదేశాలను పాటించని కారణంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 26.70 లక్షల జరిమానా విధించినట్లు మరో ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీకి సంబంధించిన నిబంధనలలోని కొన్నిటిని ఉల్లంఘించినందుకు ఆప్టస్ ఫైనాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 3.10 లక్షల పెనాల్టీ కూడా ఆర్‌బీఐ విధించింది.






