RBI: ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లపై ఆర్‌బీఐ బిగ్ రిలీఫ్

by S Gopi |

బ్యాంకులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎన్‌ఆర్‌ఐలకు మరింత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేయవచ్చు.

RBI: ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లపై ఆర్‌బీఐ బిగ్ రిలీఫ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నుంచి మరిన్ని విదేశీ కరెన్సీ డిపాజిట్లను ఆకర్షించే లక్ష్యంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు, మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల కొత్త ఎఫ్‌సీఎన్ఆర్(బీ) డిపాజిట్లు, మూడు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి గల కొత్త ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లకు ఉన్న పరిమితులను తాత్కాలికంగా తొలగించింది. దీంతో బ్యాంకులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎన్‌ఆర్‌ఐలకు మరింత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేయవచ్చు. ప్రస్తుతం ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఎఫ్‌సీఎన్ఆర్(బీ) డిపాజిట్లపై 6 శాతం వరకు వడ్డీ అందిస్తుండగా, యెస్ బ్యాంక్ 6.6 శాతం వరకు, సీఎస్‌బీ బ్యాంక్ 6.95 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. విదేశీ కరెన్సీ ప్రవాహాలను పెంచడం, బ్యాంకింగ్ వ్యవస్థలో డాలర్ లిక్విడిటీని బలోపేతం చేయడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story