- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RBI: కోటక్ మహీంద్రా, పీఎన్‌బీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులపై ఆర్‌బీఐ భారీ జరిమానా
by S Gopi |
నియంత్రణాపరమైన నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఆర్‌బీఐ జరిమానా విధించింది

X
దిశ, బిజినెస్ బ్యూరో: నియంత్రణాపరమైన నియమాలను ఉల్లంఘించిన కారణంగా కోటక్ మహీంద్ర బ్యాంకుతో పాటు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, పంజాన్ నేషనల్ బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) భారీ జరిమానా విధించింది. ఈ మేరకు గురువారం ఆర్‌బీఐ ప్రకటన విడుదల చేసింది. బ్యాంక్ క్రెడిట్ డెలివరీ కోసం రుణ మార్గదర్శకాలు, రుణాలు, అడ్వాన్సుల నిబంధనలకు సంబంధించిన ఆదేశాలను పాటించని కారణంగా కోటక్ మహీంద్ర బ్యాంకుపై రూ. 61.4 లక్షల జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే, నో యువర్ కస్టమర్(కేవైసీ) నిర్దిష్ట ఆదేశాలను పాటించని కారణంగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుపై రూ. 38.6 లక్షలు, బ్యాంకుల్లో వినియోగదారుల సేవలపై సెంట్రల్ బ్యాంకు జారీ చేసిన ఆదేశాలను పాటించని కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంకుపై రూ. 29.6 లక్షల పెనాల్టీ విధించినట్టు ఆర్‌బీఐ పేర్కొంది.
Next Story






