Yes Bank: యెస్ బ్యాంకుపై ఆర్‌బీఐ భారీ జరిమానా

by S Gopi |

ఖాతాలు తెరిచే సమయంలో వినియోగదారుల కేవైసీ వివరాలను గుర్తించేందుకు ఉపయోగించే ప్రత్యేక ఐడెంటిఫైయర్‌ను ఉపయోగించే వ్యవస్థను యెస్ బ్యాంకు అమలు చేయలేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Yes Bank: యెస్ బ్యాంకుపై ఆర్‌బీఐ భారీ జరిమానా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ యెస్ బ్యాంకుతో పాటు హిందూజా హౌసింగ్ ఫైనాన్స్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) జరిమానా విధించింది. కేవైసీ నిబంధనలకు సంబంధించిన కీలక మార్గదర్శకాలను పాటించని కారణంగా ప్రైవేట్ రంగ యెస్ బ్యాంకుపై ఆర్‌బీఐ రూ.31.80 లక్షల జరిమానా విధించింది. ఖాతాలు తెరిచే సమయంలో వినియోగదారుల కేవైసీ వివరాలను గుర్తించేందుకు ఉపయోగించే ప్రత్యేక ఐడెంటిఫైయర్‌ను ఉపయోగించే వ్యవస్థను యెస్ బ్యాంకు అమలు చేయలేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితిపై చేపట్టిన తనిఖీల్లో ఈ లోపాలను గుర్తించినట్టు ఆర్‌బీఐ తెలిపింది. కెవైసీ విధానాలు బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, మోసాల నియంత్రణ, మనీ లాండరింగ్ నివారణకు కీలకమని, వీటి అమలుపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇదే సమయంలో, నిర్వహణకు సంబంధించిన ఆదేశాలను పాటించడంలో విఫలమైన కారణంగా హిందూజా హౌసింగ్ ఫైనాన్స్‌పైనా ఆర్‌బీఐ రూ.1.8 లక్షల జరిమానా విధించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నియంత్రణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిందేనని, చిన్న లోపాలపైనా చర్యలు తప్పవని ఆర్‌బీఐ పేర్కొంది.

Next Story