- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AU Small Finance Bank: 'యూనివర్శల్ లైసెన్స్' పొందిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఇది బ్యాంకు ప్రయాణంలో ఒక మైలురాయిగా ఉండనుంది

దిశ, బిజినెస్ బ్యూరో: స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఈ విభాగంలో ఉన్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఏయూఎస్ఎఫ్‌బీ) ఇకపై పూర్తిస్థాయిలో వాణిజ్య బ్యాంకుగా మారనుంది. దీనికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఏయూఎస్ఎఫ్‌బీకి యూనివర్శల్ లైసెన్స్ మంజూర్ చేసింది. దీంతో గత దశాబ్ద కాలంలోనే తొలిసారి ఈ లైసెన్స్ పొందిన బ్యాంకుగా నిలిచింది. దేశంలో పనిచేస్తున్న 11 చిన్న ఫైనాన్స్ బ్యాంకులలో అతిపెద్దదైన ఏయూ బ్యాంక్ గురువారం 'సూత్రప్రాయంగా' ఆమోదం పొందింది. ఇది బ్యాంకు ప్రయాణంలో ఒక మైలురాయిగా ఉండనుంది. దీనివల్ల దేశంలోని ఇతర చిన్న బ్యాంకులు కూడా పెద్ద బ్యాంకులుగా మారడానికి తలుపులు తెరుస్తుంది. ఇప్పటికే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా యూనివర్శల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. చివరిసారిగా 2014లో ఆర్‌బీఐ బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ(ఇప్పుడు ఐడీఎఫ్‌సీ ఫస్ట్) బ్యాంకులకు ఈ తరహా బ్యాంకింగ్ లైసెన్స్ మంజూరు చేసింది. కేంద్ర బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం, కనీస నికర విలువ రూ. 1,000 కోట్లతో పాటు ఇతర నిర్దిష్ట ప్రమాణాలు కలిగి ఉన్న లిస్టెడ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సాధారణ, కమర్షియల్ బ్యాంకుల తరహాలో సేవలందించేందుకు అర్హత సాధిస్తాయి.






