- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI Governor: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
కొన్ని గంటల పాటు ఆసుపత్రిలో చేరిన ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

X
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరారు. అసిడిటీ కారణంగా కొన్ని గంటల పాటు ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆయన మంగళవారం సాయంత్రం చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధి ధృవీకరించారు. సోమవారం రాత్రి అసిడిటీ సమస్యతో దాస్ ఇబ్బంది పడ్డారు. సాధారణ టెస్టింగ్ కోసం చెన్నై ఆసుపత్రిలో చేరారని అపోలో హాస్పిటల్స్ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం దాస్ పరిస్థితి నిలకడగా ఉందని, అవసరమైన పరీక్షలు నిర్వహించిన తర్వాత డిశ్చార్జ్ అయినట్టు, ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారిక ప్రకటన వెలువడింది.
Next Story






