- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: మార్చి 31న బ్యాంకులు పనిచేయాల్సిందే
ఈ ఏడాది మార్చి 31న మహవీర్ జయంతి కావడంతో సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం, బ్యాంకులకు ఆరోజు సెలవు ఉంటుంది

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నదంటే చాలామంది పన్ను సహా ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే, ఈ ఏడాది మార్చి 31న మహవీర్ జయంతి కావడంతో సాధారణ సెలవుల క్యాలెండర్ ప్రకారం, బ్యాంకులకు ఆరోజు సెలవు ఉంటుంది. అయితే, ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో బ్యాంకు యథావిధిగా పనిచేయాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతున్న కారణంగా ప్రభుత్వ రసీదులు, చెల్లింపుల లావాదేవీలను నిర్వహించాల్సిన బ్యాంకులు మార్చి 31న తెరిచే ఉంచాలి. 2025-26 ఆర్థిక సంవత్సరంలోపే ప్రభుత్వ రసీదులు, చెల్లింపులకు సంబంధించి ప్రతి లావాదేవీ జరిగినట్లుగా వివరాలు లెక్కలోకి రావాలనేదే ఈ నిర్ణయం ఉద్దేశమని ఆర్‌బీఐ పేర్కొంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మార్చి 31న దేశంలోని బ్యాంకులన్నీ తెరిచి ఉంచాలని ఆర్‌బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ వ్యాపారంతో అనుసంధానం ఉన్న అన్ని శాఖలు మార్చి 31న ఎప్పటిలాగే కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కానీ, సాధారణ కార్యకలాపాలు జరుగుతాయా లేదా అనే విషయంపై కస్టమర్లు ముందుగా ధృవీకరించుకుంటే మంచిది.






