- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RBI: స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల నుంచి యూపీఐలో ప్రీ-అప్రూవ్‌డ్ క్రెడిట్‌కు అనుమతి
యూపీఐలో ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ అనేది సామాన్యుల్లో లోన్ యాక్సెస్‌ని పెంచేందుకు రూపొందించిన విధానం

దిశ, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎస్ఎఫ్‌బీ)లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలను పెంచేందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ సౌకర్యాన్ని అందించడానికి అనుమతి ఇస్తున్నట్టు వెల్లడించింది. తద్వారా యూపీఐలో ప్రీ-అప్రూవ్డ్ లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా సామాన్యులకు రుణాల యాక్సెస్‌ను పెరగనుంది. యూపీఐలో ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ అనేది సామాన్యుల్లో లోన్ యాక్సెస్‌ని పెంచేందుకు రూపొందించిన విధానం. తాజాగా యూపీఐ ద్వారా లావాదేవీల చేసే బ్యాంకు నుంచి క్రెడిట్ లైన్‌ను పొందడానికి ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. యూపీఐ క్రెడిట్ లైన్ అనేది ఒక విధమైన సిస్టమ్. ఇది క్రెడిట్ కార్డ్ లేదా ప్రీ-అప్రూవ్డ్ లోన్ తరహాలో పనిచేస్తుంది. ఇందులో వినియోగదారులు నిర్ణీత పరిమితి వరకు రుణాలు తీసుకోవచ్చు. వినియోగదారులు ఖర్చు చేసిన మొత్తంపై మాత్రమే వడ్డీ వసూలు చేస్తారు. యూపీఐ ప్రస్తుతం లింక్డ్ సేవింగ్స్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలు, ప్రీపెయిడ్ వాలెట్లు, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా లావాదేవీలను సులభతరం చేస్తోంది. కొత్త అప్‌డేట్‌తో, క్రెడిట్ లైన్‌లు అదనపు నిధుల వనరుగా ఉండనున్నాయి. అయితే, ఈ ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్లను ఉపయోగించడానికి ముందు వినియోగదారులు స్పష్టమైన అంగీకారాన్ని అందించాల్సి ఉంటుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కస్టమర్‌లు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలు లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించినట్లే, యూపీఐ ద్వారా ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌లను యాక్సెస్ చేయవచ్చు. ప్రత్యేకంగా రుణ దరఖాస్తు అవసరం లేకుండా స్వల్పకాలిక క్రెడిట్‌ను తక్షనం పొందడానికి ఇది అనుమతిస్తుంది.






