- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RBI: అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు సైబర్ ఫ్రాడ్ టూల్‌ను వాడాలని ఆర్‌బీఐ ఆదేశాలు
ఈ టూల్ సైబర్ మోసాలను అరికట్టడంలో ఆర్థిక సంస్థలకు ముందుగానే కీలక సమాచారాన్ని అందించి అప్రమత్తం చేస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ మోసపూరిత కాల్స్, మెసేజ్‌లను అరికట్టడానికి టెలికాం శాఖ అభివృద్ధి చేసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ టూల్‌ను ఉపయోగించుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అన్ని బ్యాంకులకు సూచించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ టూల్ సైబర్ మోసాలను అరికట్టడంలో ఆర్థిక సంస్థలకు ముందుగానే కీలక సమాచారాన్ని అందించి అప్రమత్తం చేస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైబర్ మోసాలకు పాల్పడే నంబర్లను ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ టూల్(ఎఫ్ఆర్ఐ) కింద మిడ్, హై, వెరీ హై వంటి మూడు విభాగాల కింద గుర్తించవచ్చు. వీటి ద్వారా ఆర్థిక మోసాలను రియల్ టైమ్‌లో కనుగొనవచ్చు. ఇలాంటి నంబర్లను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ),నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, టెలికాం విభాగానికి చెందిన చక్సు ప్లాట్‌ఫామ్ వంటి వివిధ సోర్సుల ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పరస్పరం పంచుకుంటాయి. సైబర్ మోసాలను అరికట్టేందుకు దేశంలోని అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, చిన్న ఫైనాన్షియల్ కంపెనీలు, పేమెంట్ బ్యాంకులు, సహకార బ్యాంకులు తమ కార్యకలాపాల్లో ఈ ఎఫ్ఆర్ఐను అనుసంధానం చేస్తాయి. తద్వారా ఏ సంస్థ పేరున సైబర్ మోసానికి పాల్పడినా, సంబంధిత నంబర్లు ఇతర బ్యాంకులు, సంస్థల కస్టమర్లకు చేసే సమయంలో ఎఫ్ఆర్ఐ టూల్ ద్వారా ఫ్రాడ్ నంబర్‌గా వార్నింగ్ ఇస్తుంది. ఏదైనా మొబైల్ నంబర్‌తో ఆన్‌లైన్ లావాదేవీ చేస్తున్నప్పుడు సదరు నంబర్ ఏవైన ఆర్థిక మోసాల్లో భాగమై ఉంటే ముందుగానే ఆ ప్రమాదాన్ని తెలియజేస్తుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను ఫోన్‌పే, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పేటీఎం, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు వంటి ప్రముఖ సంస్థలు ఉపయోగిస్తున్నాయి.






