- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుడ్ డెలివరీలోకి ర్యాపిడో ‘ఓన్లీ’ ఎంట్రీ.. జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీ తప్పదా!
ప్రముఖ రైడింగ్ యాప్ ర్యాపిడో 'ఓన్లీ' పేరుతో రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ వసూలు చేయని సరికొత్త ఫుడ్ డెలివరీ సేవలను సైలెంట్‌గా ప్రారంభించింది.

దిశ, వెబ్‌డెస్క్: టూ వీలర్ రైడింగ్ దిగ్గజం ర్యాపిడో (Rapido) సంచలన నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ సేవల కోసం ‘ఓన్లీ’ (Ownly) పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం డెలివరీ యాప్‌గానే కాకుండా, కస్టమర్లకు, రెస్టారెంట్లకు అత్యంత లాభదాయకమైన ప్లాట్‌ఫామ్‌గా దీనిని తీర్చిదిద్దింది. సాధారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్ రెస్టారెంట్ల నుంచి భారీగా కమీషన్ వసూలు చేస్తాయి. కానీ, ‘ఓన్లీ’ యాప్ రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. దీంతో రెస్టారెంట్లు తమ మెనూ ధరలను పెంచాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా కస్టమర్లకు హోటల్ ధరలకే ఆహారం లభించే అవకాశం ఉంది.
ప్లాట్‌ఫామ్ ఫీజు జీరో..
అయితే, ఇతర ఫుడ్ యాప్‌లో ఉన్నట్లుగా ప్లాట్‌ఫామ్ ఫీజులు, అదనపు ఛార్జీలు ‘ఓన్లీ’ యాప్‌లో ఉండవని ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. మెనూ ధరలను ఆర్టిఫిషియల్‌గా పెంచబోమని కంపెనీ తేల్చి చెప్పింది. కస్టమర్లకు కేవలం తాము ఆర్డర్ చేసిన ఆహారానికి, డెలివెరీ కోసం మాత్రమే డబ్బు చెల్లిస్తే సరిపోతుంది.
తొలుత బెంగళూరులో..
ర్యాపిడో తన ‘ఓన్లీ’ ఫుడ్ డెలివరీ యాప్‌ను బెంగళూరు (Bengaluru)లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అయితే, అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి త్వరలోనే ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై వంటి మెట్రో నగరాలకు సేవలను విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. తక్కువ ధరకే కస్టమర్‌కు ఫుడ్ అందించడమే లక్ష్యంగా వచ్చిన ‘ఓన్లీ’ యాప్ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న జొమాటో, స్విగ్గీలకు గట్టి పోటీని ఇవ్వడం తథ్యమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.






