Rapido: ఫుడ్ డెలివరీ సేవల్లోకి ర్యాపిడో

by S Gopi |

మరికొన్ని రోజుల్లో కంపెనీ ఈ సేవలను పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరులో ప్రారంభించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Rapido: ఫుడ్ డెలివరీ సేవల్లోకి ర్యాపిడో
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్యాబ్ సేవల కంపెనీ ర్యాపిడో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కొన్నేళ్లుగా జొమాటో, స్విగ్గీలు ఆధిపత్యం చెలాయిస్తున్న ఫుడ్ డెలివరీ విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయిచింది. మరికొన్ని రోజుల్లో కంపెనీ ఈ సేవలను పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరులో ప్రారంభించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనికోసం ప్రధాన రెస్టారెంట్ చెయిన్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని యోచిస్తోంది. మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌ వంటి ఫ్రాంచైజీ నిర్వాహకులతో పాటు ఇతర క్విక్-సర్వీస్ రెస్టారెంట్‌లు, క్లౌడ్ కిచెన్ చైన్‌లతో చర్చలు జరుపుతోంది. మొదట తక్కువ దూరంలో ఉండే పెద్ద రెస్టారెంట్ల నుంచి డెలివరీ సేవలు అందించాలని ర్యాపిడో భావిస్తోంది. ముఖ్యంగా వివిధ నగరాల్లో ఫ్రాంచైజీలు కలిగిన రెస్టారెంట్లతో భాగస్వామ్యం ద్వారా ఎక్కువ ప్రాంతాల్లో సేవలను అందించవచ్చని ఆశిస్తోంది. ప్రస్తుతం ర్యాపిడో సమ్ష్త స్విగ్గీ కోసం ఫుడ్ డెలివరీ సేవలతో పాటు ప్రభుత్వ డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్‌డీసీ కోసం పనిచేస్తోంది. ఈ అనుభవంతో ప్రత్యేకంగా ఫుడ్ డెలివరీ సేవలందించడంపై ర్యాపిడో దృష్టి సారించనుంది.

Next Story