Doha Bank: భారత్‌కు గుడ్‌బై చెప్పిన ఖతార్‌ దోహా బ్యాంక్

by S Gopi |

దేశంలో కేవలం ఒక రిప్రజెంటేటివ్ కార్యాలయాన్ని మాత్రమే కొనసాగిస్తామని బ్యాంక్ ప్రకటించింది.

Doha Bank: భారత్‌కు గుడ్‌బై చెప్పిన ఖతార్‌ దోహా బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఖతార్‌కు చెందిన దోహా బ్యాంక్ భారత మార్కెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. దశాబ్దానికి పైగా కార్యకలాపాలు నిర్వహించిన తర్వాత బ్యాంకు తన ముంబై, కొచ్చి రెండు బ్రాంచులను మూసివేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మార్పులో భాగంగా దేశంలో కేవలం ఒక రిప్రజెంటేటివ్ కార్యాలయాన్ని మాత్రమే కొనసాగిస్తామని బ్యాంక్ ప్రకటించింది. దోహాలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన బోర్డు సమావేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు, దీనికి సంబంధించి స్థానిక స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమాచారం ఇచ్చారు. ప్రధానంగా బ్యాంకు దేశీయంగా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి భారతీయ బ్యాంకులతో పోటీ పడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అలాగే, మన ఆర్‌బీఐ పాటించే కఠిన నిబంధనలు, తక్కువ లాభాలు, విస్తరణ లేకపోవడం, రిటైల్ బ్రాంచులకు బదులుగా కార్పొరేట్ క్లయింట్లు, గ్లోబల్ వ్యాపారంపై దృష్టి సారించడంతో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు వచ్చిన తర్వాత, దేశంలో బ్యాంకు బ్రాంచులను మూసివేసి, రిప్రజెంటేటివ్ ఆఫీస్‌ని కొనసాగించనుంది. కాగా, దోహా బ్యాంకు 2014, జూన్‌లో ముంబైలో తన మొదటి బ్రాంచును ప్రారంభించింది.

Next Story