- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pure EV: రూ. 400 కోట్లతో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్న ప్యూర్ ఈవీ..!
భారతదేశంలో గత కొంత కాలంగా ఎలెక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో గత కొంత కాలంగా ఎలెక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కంపెనీలు దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్(EV) టూ వీలర్ తయారీ సంస్థ ప్యూర్ ఈవీ(Pure EV) మరో ప్లాంట్(Plant) ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దాదాపు రూ. 400 కోట్లతో మొత్తం 46 ఎకరాల్లో ఈ ప్లాంటును నిర్మిస్తున్నామని, దీని ద్వారా ఏడాదికి లక్ష 80 వేల ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలను తయారు చేయగలమని ప్యూర్ ఈవీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నిశాంత్ డొంగరి(Nishanth Dongari) తెలిపారు. ఇప్పటికే సంగారెడ్డి(Sangareddy)లో ఉన్న ప్లాంట్ ద్వారా సుమారు 500 మందికి ఉద్యోగా అవకాశాలు కల్పించామని, కొత్తగా నిర్మించే ప్లాంటులో మరో 1,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా మరో 250 కొత్త డీలర్ షిప్ లను స్టార్ట్ చేస్తామని, దీంతో అవుట్ లెట్ల సంఖ్య 320కి చేరుకుంటదని వివరించారు. తమ వెహికల్స్ లో బ్యాటరీలు హీట్ కాకుండా నానో ఫేస్ ఛేంజ్ మెటీరియల్ వాడుతున్నామని.. తద్వారా వాహనం పేలిపోయే అవకాశముండదని తెలిపారు. ఈ టెక్నాలజీ(Technology)ని యూజ్ చేస్తున్న ఫస్ట్ కంపెనీ తమదేనని వెల్లడించారు. కాగా ప్యూర్ ఈవీ ఇటీవలే మిడిల్ ఈస్ట్(Middle East), ఆఫ్రికా(Africa) దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి క్లారియన్ ఇన్వెస్ట్‌మెంట్(Clarion Investment) అనుబంధ సంస్థ అర్వా ఎలక్ట్రిక్(Arva Electric)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వచ్చే రెండేండ్లలో 50 వేల యూనిట్ల ఎకోడ్రైఫ్ట్(ecoDryft), ఈట్రిస్ట్ ఎక్స్(eTryst X) ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఎగుమతి చేయనుంది.






