- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Digital Gold: తగ్గిన డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు
దీంతో ఈ ఏడాదిలో మొదటిసారి నవంబర్‌లో యూపీఐ ద్వారా జరిగే డిజిటల్ బంగారం కొనుగోళ్ల విలువ క్షీణించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాదిలో బంగారాం ఊహించని విధంగా రికార్డు గరిష్ఠాలకు చేరిన సంగతి తెలిసిందే. ధరలు మరింత పెరుగుతాయనే సందేహంలో చాలామంది డిజిటల్‌గా అయినా సరే పసిడి కొనేందుకు సిద్ధపడ్డారు. అయితే, డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లపై ఇటీవల స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఈ ఏడాదిలో మొదటిసారి నవంబర్‌లో యూపీఐ ద్వారా జరిగే డిజిటల్ బంగారం కొనుగోళ్ల విలువ క్షీణించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) డేటా ప్రకారం.. గత నెల యూపీఐ ద్వారా కొనే డిజిటల్ బంగారం విలువ ఏకంగా 47 శాతం పడిపోయి రూ. 1,215.36 కోట్లకు చేరుకుంది. అంతకుముందు అక్టోబర్‌లో రూ. 2,290.36 కోట్ల విలువైన పసిడి అమ్మకాలు డిజిటల్‌గా జరిగాయి. అయితే, డిజిటల్ బంగారం కొనుగోళ్లలో పరిమాణంలో చూస్తే గత నెల 12.34 కోట్లకు పెరిగాయి. ఇది అంతకుముందు అక్టోబర్‌లో జరిగిన 11.59 కోట్ల కంటే 6.44 శాతం అధికం.
యూపీఐ ఆటో-పే, చిన్న మొత్తంతోనూ బంగారంలో ఇన్వెస్ట్ చేయగల సౌకర్యాలు ఉండటం, రోజురోజుకు ధరలు పెరుగుతున్న కారణంగా 2025లో యూపీఐ నుంచి ప్రతి నెలా డిజిటల్ బంగారం కొనుగోళ్లు పెరిగాయి. అయితే, గత నెలలోనే డిజిటల్ గోల్డ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అవేవీ సెబీ పరిధిలోకి రావు కాబట్టి నష్టపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుందని సెబీ హెచ్చరిక జారీ చేసింది. బంగారం, దాని స్వచ్ఛతను ధృవీకరించేందుకు నియంత్రణ సంస్థలు ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల ఖజానాలను తనిఖీ చేయలేవని స్పష్టత ఇచ్చింది. ఈ ప్రకటన తర్వాత డిజిటల్ గోల్డ్ అమ్మకాలు నెమ్మదించాయి.






