- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Account Closure: అలెర్ట్..అలెర్ట్.. ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్.. ఆ రోజు నుంచి బ్యాంక్ సేవలు బంద్
Account Closure: మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతా ఉందా? అయితే జనవరి 23వ తేదీ నుంచి సేవలు ఆగిపోతాయంట. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Account Closure: మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకు(Punjab National Bank)లో అకౌంట్ ఉన్నట్లయితే మీకు బిగ్ అలర్ట్. ఎందుకంటే జనవరి 23వ తేదీ నుంచి సేవలు నిలిచిపోతుంటాయి. కేవైసీ(KYC) ఒక ముఖ్యమైన తప్పనిసరిగా పాటించాల్సిన ప్రక్రియ. ఈ ప్రక్రియలో వినియోగదారుని గుర్తింపు వివరాలను బ్యాంకులకు సమర్పించడం అవసరం ఉంటుంది. ఈ వివరాలతో ఓటర్ కార్డు(Voter card), ఆధార్ కార్డు(Aadhar card), పాన్ కార్డు(PAN card), డ్రైవింగ్ లైసెన్స్(driving license) , విద్యుత్ బిల్లు(electricity bill) వంటి పత్రాలు చేర్చాల్సి ఉంటుంది. వీటిని బ్యాంకు తనిఖీ చేసి ఖాతాదారుల సమాచారాన్ని సేకరించి అప్ డేట్ చేస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాదారులు(Punjab National Bank), మీ అకౌంట్ ఉపయోగించేందుకు కేవైసీ వివరాలను అప్ డేట్ చేయాలి. కేవైసీ అప్ డేట్ చేయని వారు 2025 జనవరి 23 తర్వాత తమ అకౌంట్స్ ను ఉపయోగించలేరు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మార్గదర్శకాలను అనుగుణంగా కస్టమర్లు 2024 సెప్టెంబర్ 30 నాటికి కేవైసీ అప్ డేట్(KYC update) చేయాల్సి ఉంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు(Punjab National Bank) వారి వివరాలను అప్ డేట్ చేసేందుకు గుర్తింపు పత్రం, అడ్రస్ ప్రూఫ్, తాజా ఫొటో, పాన్ కార్డు లేదా ఫారం 60, ఆదాయం ఫ్రూఫ్, మొబైల్ నెంబర్ వంటి సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పంజాబ్ నేషనల్ బ్యాంక్ వన్ , ఇంటర్నటె బ్యాంకింగ్ లేదా నేరుగా మీ హోం బ్రాంచ్ ద్వారా 2025 జనవరి 23లోపు పూర్తి చేసుకోవచ్చు.
మీ కేవైసీ వివరాలు అప్ డేట్ చేయనట్లయితే..బ్యాంకు అకౌంట్ లో అపరేషన్లపై పరిమితులు విధించవచ్చు. కాబట్టి, ఖాతాదారులు వెంటనే తమ కేవైసీ వివరానలు అప్ డేట్ చేయాలని బ్యాంకు కోరుతోంది. సహాయం కోసం, నేరుగా మీ సమీప పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖ(Punjab National Bank)ను సందర్శించవచ్చు లేదా అధికారిక వెబ్ సైట్ (https://www.pnbindia.in) సందర్శించండి.
కేవైసీ ప్రక్రియలో బ్యాంకులు లేదా సంస్థలు తమ ఖాతాదారుల గుర్తింపును ధ్రువీకరించాల్సి ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) నిబంధనల ప్రకారం, కస్టమర్లు కేవైసీ ప్రక్రియ అనుసరించడం తప్పనిసరి అయ్యింది. అకౌంట్ తీసుకున్న తర్వాత కూడా బ్యాంకులు కేవైసీ అప్ డేట్ కోసం మెసేజ్ లు పంపిస్తుంటాయి.






