Bank Alart: ఈ బ్యాంకులో ఖాతా ఉంటే బిగ్ అలర్ట్.. జనవరి 23వ తేదీ లోపు దీన్ని చేయకుంటే ఖాతా క్లోజ్

by Vennela |

Bank Alart: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి జనవరి 23, 2025వ తేదీలోపు తమ నో యువర్ కస్టమర్ (KYC)సమాచారాన్ని అప్ డేట్ చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లను కోరింది.

Bank Alart: ఈ బ్యాంకులో ఖాతా ఉంటే బిగ్ అలర్ట్.. జనవరి 23వ తేదీ లోపు దీన్ని చేయకుంటే ఖాతా క్లోజ్
X

దిశ, వెబ్ డెస్క్ : Bank Alart: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి జనవరి 23, 2025వ తేదీలోపు తమ నో యువర్ కస్టమర్ (KYC)సమాచారాన్ని అప్ డేట్ చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లను కోరింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారుల(Punjab National Bank)కు బిగ్ అలర్ట్. ఈ బ్యాంకులో ఖాతా ఉన్న కస్టమర్లు జనవరి 23వ తేదీలోపు ఈ పనిని పూర్తి చేయాలి. లేదంటే వారి బ్యాంక్ అకౌంట్ క్లో అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Rbi) మార్గదర్శకాలను అనుసరించి జనవరి 23వ తేదీ లోపు తమ కేవైసీ సమాచారాన్ని అప్ డేట్ చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank) తన కస్టమర్లను కోరింది. 30వ తేదీ సెప్టెంబర్ 2024 వరకు కేవైసీ అప్ డేట్ కోసం పెండింగ్ లో ఉన్న ఖాతాదారులకు ఈ నియమం వరిస్తుందని తెలిపింది. తమ కేవైసీ(KYC)ని ఇంకా అప్ డేట్ చేసుకోనట్లయితే దానిని వెంటనే పూర్తి చేయండి.

ఆన్ లైన్ , ఆఫ్ లైన్ కేవైసీ(KYC) ప్రాసెస్ కస్టమర్లు తమ గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, ఇటీవలి ఫొటో, పాన్ లేదా ఫారం 60 ఆదాయ రుజువు, మొబైల్ నెంబర్ వంటి డాక్యుమెంట్స్ ను సమీపంలోని బ్రాంచ్ లలో సమర్పించాలి. అదనంగా కస్టమర్స్ PNB ONE/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసుల ద్వారా లేదా రిజిస్టర్డ్ ఇ మెయిల్ లేదా పోస్టు ద్వారా కూడా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

కేవైసీ(KYC)ని పూర్తి చేయనట్లయితే ఖాతా అపరేషన్ పరిమితం చేయవచ్చని పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పష్టం చేసింది. లేదా ఖాతాను క్లోజ్ చేయవచ్చని తెలిపింది. మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్లను చేయలేరు. కస్టమర్స్ ఏదైనా సహాయం కోసం సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank) లేదా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు. దీంతో కస్టమర్లకు అక్కడికి వెళ్లి వారి కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. కస్టమర్లు తమ కేవైసీ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి. ఇలా చేస్తే మీ బ్యాంకింగ్ లావాదేవీలలో ఎలాంటి సమస్యలు రావు.

కస్టమర్స్ కు వారి కేవైసీ పూర్తి చేసేందుకు ఆరు రోజులు మిగిలి ఉన్నాయి. మీరు మీ పొదుపు ఖాతా కేవైసీని 6రోజుల్లో పూర్తి చేయనట్లయితే అప్పుడు బ్యాంక్ అకౌంట్ హోల్డ్(Bank account hold) లోకి మారుతుంది. దాంతో మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయలేరు. ఖాతాదారులు వారి ఖాతాలు కేవైసీ పొందే వరకు ఇలానే కొనసాగుతుంది. అంటే డాక్యుమెంట్స్ సమర్పించే వరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాను యాక్టివేట్ లో ఉండదు.

Next Story