- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PMJJBY: ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన.. ఏడాదికి రూ. 20 చెల్లిస్తే చాలు అనుకోని పరిస్థితుల్లో రూ. 2 లక్షలు మీ సొంతం..!!
PMJJBY: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులు, మహిళలు సీనియర్ సిటిజన్స్ కోసం అనేక రకాల ఆర్థిక పథకాలు అందిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: PMJJBY: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులు, మహిళలు సీనియర్ సిటిజన్స్ కోసం అనేక రకాల ఆర్థిక పథకాలు అందిస్తుంది. సామాన్యుల కోసం వివిధ రకాల లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ప్రారంభించింది. వీటిలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం చాలా ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఈ స్కీమ్ కింద పాలసీదారులు నామమాత్రం ప్రీమియం చెల్లించి ఏకంగా రూ. 2 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఎలా పనిచేస్తుంది ఎవరు అర్హులు ఇలాంటి వాటి గురించి అన్నిటికీ కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 2015 మేలో ఈ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించింది. ఈ జీవిత బీమా లక్ష్యం ఇతర ప్రయోజనాలతో పాటు ఎలా దరఖాస్తు చేసుకోవాలో అర్హతలు ఏవేవి ఉంటాయో తెలుసుకుందాం.
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) పథకంలో చేరే వ్యక్తి వయసు 18 సంవత్సరాల నుంచి నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే వీరికి ఒక సేవింగ్ ఖాతా అకౌంట్ లేదా పోస్టల్ బ్యాంకులో అకౌంట్ ఉండాలి. ఈ పథకంలో చేరిన వారు ఏదైనా కారణం వల్ల అంటే అది సహజమరణం కావచ్చు లేదా యాక్సిడెంటల్ డెత్ కావచ్చు నామినీకి రెండు లక్షల రూపాయలు లభిస్తాయి.
చందాదరులు సంవత్సరానికి కేవలం రూ. 436 అంటే రోజుకి రూ. 1.20 పైసలు మాత్రం ప్రీమియం చెల్లించాలి. ఈ స్కీంలో ఉన్నవారికి ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో మే నెలలో అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ప్రీమియం అమౌంట్ చందాదారుల బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా నుంచి ఆటో డెబిట్ అవుతుంది.
ఈ పాలసీని బ్యాంకులు, LIC వంటి బీమా సంస్థలు కలిసి అందిస్తున్నాయి. కొన్ని రకాల బ్యాంకులు ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ పాలసీలో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. పాలసీదారుడు సహజ మరణం లేదా ప్రమాదంలో మృతిచెందిన సమయంలో వారి నామినీకి బీమా మొత్తం లభిస్తుంది.
అయితే ఈ స్కీమ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఇది జీవిత బీమా మాత్రమే మెడికల్ బీమా కాదని గుర్తుంచుకోవాలి. పాలసీదారు మరణించిన తరువాత మాత్రమే బీమా మొత్తం చెల్లిస్తారు. ఒక వ్యక్తి ఒకేసారి ఒకే బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరాల్సి ఉంది. PMJJBY పథకం ద్వారా, సంవత్సరం రూ.436 చెల్లించి, ప్రమాదం జరిగినప్పుడు లేదా సహజ మరణం సంభవించినప్పుడు, కుటుంబానికి రూ.2 లక్షల సాయం అందుతుంది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో మంచి భద్రత కలిగించే జీవిత బీమా పథకంగా చెప్పవచ్చు.
సురేష్ ఒక సాధారణ కూలీ పని చేసే కార్మికులు అతనికి నెలకు సుమారు పదివేల రూపాయల వరకు సంపాదన లభిస్తుంది అతని కుటుంబం మొత్తం కూడా అతనిపైనే ఆధారపడి ఉంది. సురేష్ తన సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) స్కీం లో చేరి ప్రతి సంవత్సరం 20 రూపాయలు మాత్రమే కడుతున్నాడు.
ప్రమాదవశాత్తు అతనికి ఒక రోజు యాక్సిడెంట్ జరిగింది తీవ్రమైన గాయాల పాలయ్యాడు. వైద్యులు అతడు వికలాంగుడు అయినట్లు నిర్ధారించారు. ఇక కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. కానీ అంతలోనే బాధితుడి భార్యకు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షల రూపాయల బీమా సహకారం లభించింది. ఈ మొత్తం డబ్బు వారు జీవితంలో అత్యంత కష్టం ఎదుర్కొంటున్న సమయంలో ఎంతో తోడ్పాటును అందించింది. ఇది కేవలం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)లో బీమా స్కీం లో చేరడం వల్ల మాత్రమే జరిగింది అని చెప్పవచ్చు.
స్వతంత్ర భారతదేశంలో ఈ స్కీం అత్యంత తక్కువ ప్రీమియం ఉన్న ఒక బీమా పథకం. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రమాద బీమా (Accidental Insurance)గా చెప్పవచ్చు. ఈ స్కీము వార్షిక ప్రీమియం కేవలం 20 రూపాయలు మాత్రమే. పాలసీ దారుడు ప్రమాదంలో మరణం లేదా పూర్తి శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.2 లక్షలు లభిస్తాయి. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు స్త్రీ పురుషులు ఎవరైనా ఈ స్కీములో చేరవచ్చు.
అర్హతలు ఇవే..
>> భారతీయ పౌరుడు అయి ఉండాలి.
>> బ్యాంక్ లో సేవింగ్స్ ఖాతా ఉండాలి
>> మీ బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి
>> ప్రతి సంవత్సరం జూన్ 1నుండి మే 31 వరకు పాలసీ చెల్లుబాటు అవుతుంది.
స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో బ్యాంకులో మనం ఆటో రెన్యువల్ కోసం ఆమోదం తెలిపినట్లైతే మీ అకౌంట్ నుంచి ప్రతి సంవత్సరం 20 రూపాయలు ఆటోమేటిక్ గా ఈ స్కీములో ప్రీమియం రూపంలో చెల్లింపు జరుగుతుంది.






