Post office scheme: నెలకు రూ.5వేలు కడితే చేతికి రూ.16 లక్షలు.. అదిరిపోయే పోస్టాఫీస్ స్కీమ్ ఇదే!

by Ajay Maddhiboyina |

డబ్బు సంపాదించ‌డానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే డ‌బ్బు సంపాదించ‌డం ఎంత ముఖ్య‌మో సంపాదించిన డ‌బ్బును ఎక్క‌డ ఇన్వెస్ట్ చేయాలో తెలియ‌డం కూడా అంతే ముఖ్యం. భవిష్య‌త్ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా మ‌న పెట్టుబ‌డి ఉండాలి.

Post office scheme: నెలకు రూ.5వేలు కడితే చేతికి రూ.16 లక్షలు.. అదిరిపోయే పోస్టాఫీస్ స్కీమ్ ఇదే!
X

దిశ‌, వెబ్ డెస్క్: డబ్బు సంపాదించ‌డానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే డ‌బ్బు సంపాదించ‌డం ఎంత ముఖ్య‌మో సంపాదించిన డ‌బ్బును ఎక్క‌డ ఇన్వెస్ట్ చేయాలో తెలియ‌డం కూడా అంతే ముఖ్యం. భవిష్య‌త్ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా మ‌న పెట్టుబ‌డి ఉండాలి. అంతే కాకుండా రిస్క్ చాలా త‌క్కువ‌గా ఉండాలి. అలాంటి ప‌థ‌కాల్లో ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ (post office scheme) కూడా ఒక‌టి. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన ఈ దీర్ఘ‌కాలిక ప‌థ‌కం ద్వారా రిట‌ర్న్స్ అధికంగా వ‌స్తాయి. ఈ ప‌థ‌కం ప్ర‌స్తుతం సంవ‌త్స‌రానికి 7.1శాతం వ‌డ్డీ అందిస్తుంది. అదే విధంగా ఏడాదికోసారి చక్రవడ్డీ సైతం అందిస్తుంది.

ఈ పథకంలో మీరు నెలకు రూ.5వేల చొప్పున అంటే సంవత్సరానికి రూ.60,000 చొప్పున 25ఏళ్లు పెట్టుబడి పెడితే మీ పొదుపు మొత్తం రూ.15 లక్షలు అవుతుంది. దీనికి వడ్డీగా రూ.1.27 లక్షలు కలిపి చేతికి రూ.16.27 లక్షలు వస్తాయి. ఇందులో ఇన్వెస్ట్ చేయ‌డం వ‌ల్ల మీ పొదుపుపై, మీకు వ‌చ్చిన వ‌డ్డీపై ఎలాంటి ట్యాక్స్ ఉండ‌దు. ఈ పథకం కింద డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా జాతీయ బ్యాంకులో అకౌంట్ తెరిచి జమచేయాల్సి ఉంటుంది. త‌క్కువ రిస్క్ తో మంచి లాభం పొందాలని అనుకునేవారికి ఇది బెస్ట్ స్కీమ్ అనే చెప్పాలి. అంతే కాకుండా పిల్ల‌ల విద్య‌, పెళ్లి, ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర‌వాత జీవితం లాంటి దీర్ఘకాలిక ల‌క్ష్యాల కోసం పీపీఎఫ్ స్కీమ్ ఎంచుకోవ‌చ్చు.

Next Story