Post Office Scheme: మీ పిల్లల పేరు మీద కేవలం రూ. 6 పొదుపు చేస్తే లక్ష బెనిఫిట్..పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ ఇదే

by Vennela |

Post Office Scheme: మనం ఎంత సంపాదిస్తున్నామనే దానికంటే భవిష్యత్తు అవసరాల కోసం ఎంత పొదుపు చేస్తున్నామనేది చాలా ముఖ్యం.

Post Office Scheme: మీ పిల్లల పేరు మీద కేవలం రూ. 6 పొదుపు చేస్తే లక్ష బెనిఫిట్..పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: Post Office Scheme: మనం ఎంత సంపాదిస్తున్నామనే దానికంటే భవిష్యత్తు అవసరాల కోసం ఎంత పొదుపు చేస్తున్నామనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో చెప్పలేం. ముఖ్యంగా పెళ్లై పిల్లలు ఉన్నవారు కచ్చితంగా వారి భవిష్యత్ అవసరాల కోసం ప్రతినెలా ఎంతో కొంత సేవింగ్స్ చేయాల్సిందే. పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్న కొద్దీ వారి చదువు, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులు భారీగా పెరిగిపోతుంటాయి.

దాంతో మీరు సంపాదించే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక, చిన్నారుల చదువుల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. అందుకే నేటి రోజుల్లో చాలా మంది పిల్లల పేరుతో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి మీరు కూడా పిల్లల పేరుమీద సేవింగ్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా. అయితే పోస్టాఫీస్ అందిస్తున్న ఈ స్కీమ్ పై ఓ లుక్కేయ్యండి. అదే బాల్ జీవన్ బీమా యోజన స్కీమ్. మరి ఈ పథకం అర్హతలు ఏంటి ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు. ఎలా చేరాలో తెలుసుకుందాం.

బాల్ జీవన్ బీమా పథకం పేరుతో ఇండియన్ పోస్టాఫీస్ పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే విధంగా ఈ స్కీమును ప్రవేశపెట్టింది. ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునేవారు వారి ఆర్థిక స్తోమతను బట్టి రోజుకు కనిష్టంగా రూ. 6 నుంచి గరిష్టంగా రూ. 18 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు వారి పిల్లల పేరుమీద ఈ పొదుపు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ స్కీములో చేరాలనుకునే పిల్లల వయస్సు 5 నుంచి 20ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఒక ఫ్యామిలీలో గరిష్టంగా ఇద్దరు పిల్లల వరకు బాల జీవన్ బీమా స్కీములో పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారు రోజుకు కనీసం 6 రూపాయలు పెట్టుబడి పెడితే మెచ్చూరిటీ ముగిసిన తర్వాత కనీస హామీ మొత్తం లక్ష వరకు రాబడి పొందవచ్చు. మీరు చిన్నారులపై రోజుకు 18 రూపాయలు పొదుపు చేస్తే మెచ్యూరిటీ ముగిసిన తర్వాత 3 లక్షల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఇక ఇద్దరు పిల్లల మీద ప్రతిరోజూ 36 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఇద్దరిది కలిపి మొత్తం రూ. 6లక్షల వరకు బెనిఫిట్ పొందుతారు.

బాల్ జీవన్ బీమా యోజన స్కీములో మీరు చిన్నారుల పేరు మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగా సమీపంలోని పోస్ట్ ఆఫీస్ కు వెళ్లండి. అక్కడ సంబంధిత అధికారులను కలిసి ఈ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ లో మీ పిల్లల గురించి పూర్తి వివరాలను ఎంటర్ చేయండి. పాలసీదారుడు మీ వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్ ను సమర్పించి అకౌంట్ ను ఓపెన్ చేయాలి.

Next Story