Post Office Recurring Deposit Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీములో డబ్బు డిపాజిట్ చేస్తే కేవలం 5ఏళ్లలో 10 లక్షలు మీ సొంతం..!!

by Vennela |   (  Updated:2025-05-26 11:14:21  IST  )

Post Office Recurring Deposit Scheme: ప్రస్తుతం ఎన్ని రకాల స్కీములు వచ్చినప్పటికీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ ప్రజలకు ఇంకా పోస్ట్ ఆఫీస్ స్కీముల పైన ఎక్కువగా నమ్మకం ఉందని చెప్పవచ్చు.

Post Office Recurring Deposit Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీములో డబ్బు డిపాజిట్ చేస్తే కేవలం 5ఏళ్లలో 10 లక్షలు మీ సొంతం..!!
X

దిశ, వెబ్ డెస్క్: Post Office Recurring Deposit Scheme: ప్రస్తుతం ఎన్ని రకాల స్కీములు వచ్చినప్పటికీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ ప్రజలకు ఇంకా పోస్ట్ ఆఫీస్ స్కీముల పైన ఎక్కువగా నమ్మకం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అనేది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంస్థ. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లోనూ ఉండే ఏకైక కేంద్ర ప్రభుత్వ ఆఫీసు ఏదైనా ఉందంటే అది పోస్ట్ ఆఫీస్ అని చెప్పవచ్చు. పోస్ట్ ఆఫీస్ కేవలం ఉత్తర ప్రత్యుత్తరాల కోసం మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉండే ఒక బ్యాంకు గా కూడా ఉపయోగపడుతుంది. పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ద్వారా అనేక పథకాల అమల్లో ఉన్నాయి అందులో అత్యంత ముఖ్యమైనది. రికరింగ్ డిపాజిట్ పథకం. ఉపయోగించి పది లక్షల రూపాయలు ఐదు సంవత్సరాలలో పొందాలంటే నెలకు ఎంత జమ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్

పోస్ట్ ఆఫీస్ వారు స్పాన్సర్ చేస్తున్న ఈ రికరింగ్ డిపాజిట్ స్కీం ఉపయోగించి మీరు ప్రతి నెల నిర్ణీత మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకున్నట్లయితే, మీకు నిర్ణీత కాల వ్యవధిలో పెద్ద మొత్తంలో డబ్బులు లభించే అవకాశం ఉంది. ఉదాహరణకు మీకు ఐదు సంవత్సరాలు 10 లక్షల రూపాయలు కావాలంటే ఏం చేయాలో ప్రతినెల రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ఎంత పొదుపు చేయాలో తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీం ప్రకారం ప్రస్తుతం అందుబాటులో ఉన్న వడ్డీ రేటు 6.7% చెల్లిస్తున్నారు. 60 నెలల పాటు మీరు డిపాజిట్ చేయడం ద్వారా 10 లక్షలు సంపాదించాలి అంటే ప్రతి నెల 15 వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఐదు సంవత్సరాలపాటు 15వేల రూపాయలను మీరు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేసినట్లయితే ఐదు సంవత్సరాల తర్వాత మీకు వడ్డీతో కలిపి రూ. 10,58,000 లభించే అవకాశం ఉంది. ఇందులో అసలు రూ. 9,00,000 ఉండగా, వడ్డీ మొత్తం రూ. 1,58,000గా అవుతంది. ఇతర స్కీములతో పోల్చి చూసినట్లయితే, రికరింగ్ డిపాజిట్ స్కీం అనేది ఎంతో సేఫ్ అని చెప్పవచ్చు.

కేవలం ఐదు సంవత్సరాల్లోనే మీరు 10 లక్షల రూపాయలను జమ చేసే అవకాశం లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీం కింద మీరు డిపాజిట్ చేసిన డబ్బు గ్యారెంటీగా మీకు లభించే రిటర్న్ అని చెప్పవచ్చు. పోస్ట్ ఆఫీస్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నడిచే ప్రభుత్వ విభాగం కనుక మీ డబ్బుకు ఖచ్చితంగా భరోసా లభిస్తుంది.

Read More..

Post Office Saving scheme: 5ఏళ్లలో రూ. 14 లక్షలు మీ చేతికి అందించే సూపర్ డూపర్ స్కీమ్ ఇదే..!!

Next Story