- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Poco Mobile: 6000ఎంఏహెచ్ బ్యాటరీతో సీ85 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన పోకో
ఐపీ64 రేటింగ్‌తో వస్తున్న ఈ ఫోన్ 50ఎంపీ వెనుక కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో భారత మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. సీ85 పేరుతో తెచ్చిన ఈ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. పోకో సీ85 స్మార్ట్‌ఫోన్ రెండు రోజుల కంటే ఎక్కువ బ్యాటరీ యూసేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఐపీ64 రేటింగ్‌తో వస్తున్న ఈ ఫోన్ 50ఎంపీ వెనుక కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ధరకు సంబంధించి 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ. 11,999, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ. 12,999, 8జీబీ ర్యామ్, 128జీబీ ధర రూ. 14,499గా నిర్ణయించినట్టు పేర్కొంది. డిసెంబర్ 16 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో పోకో సీ85 అమ్మకాలు ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ ఎంపిక చేసిన కార్డ్‌లపై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా రూ. 1000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ సదుపాయం కల్పిస్తోంది. మూడు నెలల వడ్డీ లేని ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉందని పోకో అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆఫర్‌లు అమ్మకాలు మొదలైన తొలి రోజు మాత్రమే వర్తిస్తాయి.






