PNB: మినిమమ్ బ్యాలెన్స్ జరిమానాలు మాఫీ చేసిన పీఎన్‌బీ

by S Gopi |

ఈ నిర్ణయం జూలై 1 నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంకు తన అధికారిక ప్రకటనలో తెలిపింది.

PNB: మినిమమ్ బ్యాలెన్స్ జరిమానాలు మాఫీ చేసిన పీఎన్‌బీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రజల ఆర్థిక అవసరాలను మెరుగుపరిచేందుకు, ఖాతాదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు అన్ని పొదుపు ఖాతాలలో కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించకుండా జరిమానా ఉన్న అన్ని ఛార్జీలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం జూలై 1 నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంకు తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం వెనుక ముఖ్యంగా మహిళలు, రైతులు, తక్కువ ఆదాయం ఉన్న వారిని ప్రాధాన్యంగా తీసుకున్నదని, బ్యాలెన్స్ నిర్వహణపై జరిమానా అనే ఒత్తిడి లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందడంతో పాటు మరింత మంది కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు అందించే లక్ష్యంతో తీసుకున్నట్టు బ్యాంకు వివరించింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ రంగం పట్ల తమకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ ఛార్జీలను మాఫీ చేయడం వల్ల కస్టమర్లపై ఎలాంటి ఆర్థిక ఒత్తిడి ఉండదు. ఇకపై వారు బ్యాంకు సేవలు పొందడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని పీఎన్‌బీ సీఈఓ, ఎండీ అశోక్ చంద్ర వెల్లడించారు.

Next Story