- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Loan Rates: రుణాలపై వడ్డీ రేట్లను సవరించిన వివిధ బ్యాంకులు
పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు ఆర్‌బీఐ ప్రకటన ఆధారంగా రుణాలపై వడ్డీని తగ్గించాయి

దిశ, బిజినెస్ బ్యూరో: గతవారం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా పలు బ్యాంకు వడ్డీ రేట్లను సవరించడం ప్రారంభించాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు ఆర్‌బీఐ ప్రకటన ఆధారంగా రుణాలపై వడ్డీని తగ్గించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన రెపో-లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్)ను 8.85 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గించింది. అయితే, బ్యాంక్ తన బేస్ రేటు మరియు మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను మార్చలేదు. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే ధోరణిని అనుసరించింది. దాని రెపో-ఆధారిత లెండింగ్ రేటును 8.85 శాతం నుండి 8.35 శాతానికి తగ్గించింది. యూకో బ్యాంక్ అన్ని కాలపరిమితులపై దాని ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. సవరించిన వడ్డీ రేట్లు జూన్ 10 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. కస్టమర్లు తీసుకున్న గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్‌పై యూకో బ్యాంకు వడ్డీని 8.8 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది.






