Banks: ఎంసీఎల్ఆర్ తగ్గించిన పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా

by S Gopi |   (  Updated:2025-09-02 17:34:59  IST  )

పీఎన్‌బీ వివిధ కాలవ్యవధులపై 15 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్‌ను తగ్గించింది.

Banks: ఎంసీఎల్ఆర్ తగ్గించిన పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లను(ఎంసీఎల్ఆర్) తగ్గించాయి. దీనివల్ల ఇళ్ల, వాహన రుణాలు తీసుకునే వారికి ప్రయోజనం కలుగుతుంది. పీఎన్‌బీ వివిధ కాలవ్యవధులపై 15 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్‌ను తగ్గించింది. ఓవర్‌నైట్ కాలపరిమితిపై ఎంసీఎల్ఆర్‌ను 8.15 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్‌ను 8.25 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్‌ను 8.45 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతానికి తగ్గించింది. అదేవిధంగా రిటైల్ రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్‌ను 8.80 శాతానికి తగ్గించింది. మూడేళ్ల కాలానికి 9.10 శాతానికి చేర్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్‌ను 7.95 శాతానికి, నెల రోజుల నుంచి ఆరు నెలల కాలవ్యవధులపై 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. రుణాలపై ప్రభావం చూపే ఏడాది ఎంసీఎల్ఆర్‌ను 8.85 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్‌ను 9 శాతానికి తగ్గించింది. ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేట్లు. ఇది గృహ, వ్యక్తిగా, వ్యాపార రుణాలను ప్రభావితం చేస్తుంది.

Next Story