- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PM Modi: ఫిబ్రవరి 13న సేవాతీర్థ్, కర్తవ్య భవన్ కాంప్లెక్స్‌లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 13న ప్రధానమంత్రి కార్యాలయం నూతన భవనం సేవాతీర్థ్‌ని ప్రారంభించనున్నారు. కర్తవ్య భవన్ 1,2లను కూడా అదేరోజు ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ విస్టాలో ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖల భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే కొత్త భవనాలను నిర్మించారు. కొత్త నిర్మాణం సేవాతీర్థ్ భవనంలో ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్, కేబినెట్ సెక్రటేరియట్ ఉంటాయి. గతంలో ఈ మూడు వేర్వేరు ప్రదేశాలలో ఉండేవి. కర్తవ్య భవన్ 1, 2లలో న్యాయ, రక్షణ, ఆర్థిక, ఆరోగ్య, వ్యవసాయం సహా అనేక కీలక మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఈ భవనాలు అత్యాధునిక సదుపాయాలతో పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, నీటి సంరక్షణ చర్యలు, డిజిటల్‌గా ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలు ఉంటాయి.






