రైతులకు శుభవార్త: PM Kisan Yojana: ఈ కేవైసీ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే!

by Disha Web |
రైతులకు శుభవార్త: PM Kisan Yojana: ఈ కేవైసీ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనాలు అందించేందుకు అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ గడువును ప్రభుత్వం పొడిగించింది. రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో అందిస్తున్న ఈ పథకం కోసం ఈ కేవైసీ తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇదివరకు జులై 31 చివరి గడువు కాగా, ఇంకా చాలామంది రైతులు ఈ కేవైసీ పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గడువును ఆగస్టు 31 వరకు పెంచింది.

పీఎం కిసాన్ ప్రకారం, రైతులకు ఏడాదిలో మూడు విడతలుగా రూ. 2,000 చొప్పున, మొత్తం రూ. 6,000 రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు. ఈ సాయం అందడానికి ఈ కేవైసీ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ పథకం కింద పదకొండు విడతల్లో రూ. 2,000 చొప్పున కేంద్రం రైతులకు నిధులను అందజేసింది. తదుపరి విడతకు సంబంధించి పెట్టుబడి సాయం సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలున్నాయి.

రైతులు పీఎం కిసాన్ కోసం ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆధార్ వివరాలు, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి పూర్తి చేయవచ్చు. ఈ విధానంలో ఏదైనా పొరపాట్లు జరిగితే స్థానికంగా ఉన్న ఆధార్ సేవా కేంద్రంలో సంప్రదించవచ్చు.


Next Story