- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PM Internship Scheme: నిరుద్యోగులకు శుభవార్త..ఈ ప్రభుత్వ స్కీమ్ గురించి తెలుసా? ప్రతి నెలా 5వేలు పొందే ఛాన్స్.. ఇలా చేయండి!
PM Internship Scheme: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీము(Scheme)లను అందిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: PM Internship Scheme: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీము(Scheme)లను అందిస్తున్నాయి. వీటిల్లో నిరుద్యోగులకు సంబంధించి ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈమధ్యే కేంద్రంలోని మోదీ సర్కార్(Modi Govt) నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు సరికొత్త స్కీమును ఆవిష్కరించింది. అదే పీఎం ఇంటర్న్ షిప్ పథకం(PM Internship Scheme). దీని వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది.
ఈ స్కీము కింద నిరుద్యోగులకు ఏడాదిపాటు ట్రైనింగ్ (Training) ఇస్తారు. తర్వాత ఉపాధి కల్పిచండంతోపాటు ఈ ట్రైనింగ్(Training) సమయంలో నెలకు రూ. 5వేల స్టైఫండ్ అందిస్తారు. ఇలా ఏడాదిపాటు ఇస్తారు. అంటే రూ. 60వేలు అందిస్తారు. అంతేకాదు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ట్రైనింగ్(Training) పొందే వారికి ఒకసారి రూ. 6వేలు చెల్లిస్తుంటారు. ఇక ప్రధాన్ మంత్రి జీవన్ బీమా, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన వంటి స్కీమ్స్ ద్వారా ఇన్సూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుంది.
ఏడాది పాటు ట్రైనింగ్(Training) లో 6నెలలు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆరు నెలలు ఇంటర్న్ షిప్(Internship Scheme) చేయాలి. తర్వాత వారికి ఉపాధి లభిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఇలా ఏది చదివినా అర్హులని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 11వ తేదీ వరకే సమయం ఉంది.
ఇంకా వయస్సు 21 నుంచి 24ఏళ్ల లోపు ఉండాలని తెలిపారు. https://pminternship.mca.gov.in/login/ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత అవసరమైన వివరాలన్నింటిని అందించాల్సి ఉంటుంది. ఇలా మీరు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.






