Penny Stock: లక్ష రూపాయలకు 1.42 కోట్ల రిటర్న్.. ఈ రూ.5 స్టాక్‌ గురించి తెలుసా?

by Vennela |

Multibagger Penny Stock: దేశీయ స్టాక్ మార్కెట్ పడిపోతోంది. గత కొన్నాళ్లుగా ఒడుదొడుకుల్లో ట్రేడ్ అవుతున్న సంగతి తెలిసిందే.

Penny Stock: లక్ష రూపాయలకు 1.42 కోట్ల రిటర్న్.. ఈ రూ.5 స్టాక్‌ గురించి తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: Multibagger Penny Stock: దేశీయ స్టాక్ మార్కెట్ పడిపోతోంది. గత కొన్నాళ్లుగా ఒడుదొడుకుల్లో ట్రేడ్ అవుతున్న సంగతి తెలిసిందే. కిందటి రోజు కూడా ఒక దశలో లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు..చివరిలో పడిపోయాయి అయితే కొన్ని స్టాకస్ మార్కెట్ లాభనష్టాలతో పెద్దగా సంబంధం లేకుండా దూసుకెళ్తున్నాయి. ఇలాంటి ఒక స్టాక్ గురించి తెలుసుకుందాం.

రోమ్ నగరం ఎంత అందంగా ఉంటుందో తెలిసిందే. అందుకే ఏదైనా సాధించాల్సిన సమయంలో మనకు ఎవరైనా..ఎవరికైనా ధైర్యం చెప్పాల్సి వస్తే రోమ్ నగరం ఏ ఒక్క రోజులో నిర్మించింది కాదనే సామేతను వాడుతుంటాం. ఇది స్టాక్ మార్కెట్లకు వర్తిస్తే సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఒక్కరోజులోనే భారీగా లాభాలు రావు. ఓపిక అనేది చాలా ముఖ్యం. ఓపికతోనే అద్భుతాలు సాధ్యం అవుతుంటాయి. స్టాక్ మార్కెట్లో తక్కువ కాలంలో కాకుండా దీర్ఘకాలం పాటు స్టాక్స్ హోల్డ్ చేసిన వారికి అద్భుతమైన రిటర్న్స్ వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది దిగ్జజ పెట్టుబడిదారులు ఈ విషయాన్నే నమ్ముతుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ బెనిఫిట్ కూడా పొందవచ్చు.

ఈ విషయం చాలా సార్లు నిరూపితమైంది. కోవిడ్ సమయంలో కూడా అయిపోయింది. స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ఇక ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తాయనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత భారత స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్న సంగతి తెలిసిందే. ఆల్ టైం గరిష్టాలకు సూచీలు చేరుకున్నాయి. దీంతో ఆ సమయంలో కనిష్టాల వద్ద స్టాక్స్ కొనుగోలు చేసినవారికి అద్బుత స్థాయిలో లాభాలు వచ్చాయి. అందుకే ఓపిక అనేది చాలా ముఖ్యం.

కోవిడ్ సమయం నుంచి ఇప్పటి వరకు భారీ రిటర్న్స్ అందించిన ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అదే పికాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్. 2020 మార్చి 27న ఈ స్టాక్ కేవలం రూ. 5.52 దగ్గర ఉంది. కానీ ఇప్పుడు జనవరి 24వ తేదీ వరకు చూస్తే రూ. 782.50వద్ద ఉంది. ఈ క్రమంలో ఏకంగా 142 రెట్ల వరకు రాబడి వచ్చింది. కనిష్టాల వద్ద స్టాక్ కొనుగోలు చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ఈ స్టాక్ ఊదాహరణగా నిలిచిందని నిపుణులు చెబుతున్నారు.

ఇక పెట్టుబడి పరంగా చూసినట్లయితే 6 నెలల కిందట రూ. లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ. 1.05లక్షలు అవుతుండేది. అదే ఏడాది కిందట రూ. లక్ష పెట్టుబడి పెట్టినవారి చేతికి రూ. 2.270లక్షలు వచ్చాయి. ఈ క్రమంలో 167శాతం స్టాక్ ధర పెరిగిందని చెప్పవచ్చు. ఇక కోవిడ్ సమయంలో కనిష్టాలకు పడిపోయినప్పుడు 4ఏళ్ల క్రితం లక్ష పెట్టుబడిపెట్టిన వారికి ఇప్పుడు రూ. 1.42కోట్లు వచ్చాయి. అయితే ఇటీవల మాత్రం ఈ స్టాక్ ఆల్ టైమ్ గరిష్టాల దగ్గర పడిపోయింది. నెలలోనే రూ. 1012.55నుంచి రూ. 782.50కి దిగొచ్చింది. ఈ క్రమంలో 20శాతం పతనం అయ్యింది. లాంగ్ రన్ లో మాత్రం అద్భుతస్థాయిలో లాభాలను అందించింది. అయితే దేంట్లో అయినా పెట్టుబడి చేసేముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Next Story