- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'బోల్ట్' ఫీచర్‌ను ప్రారంభించిన ఫోన్‌పే.. CVV లేకుండా చెల్లింపులు
దేశం డిజిటల్ భారత్ దిశగా అడుగులు వేస్తోంది. వందకు 70-80 శాతం క్యాష్ లెస్ పేమెంట్లు జరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశం డిజిటల్ భారత్ దిశగా అడుగులు వేస్తోంది. వందకు 70-80 శాతం క్యాష్ లెస్ పేమెంట్లు జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల్లో ముందుకున్న ఫోన్ పే పేమెంట్ గేట్ వే యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీసా, మాస్టర్ కార్డుల లావాదేవీల కోసం బోల్ట్ ఫీచర్ ను ఆవిష్కరించింది. దీని వల్ల తరచూ సీవీవీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని తెలిపింది. ఒకే క్లిక్ తో యూజర్లు ఫాస్ట్ గా సేఫ్ గా పేమెంట్స్ చేసుకోవచ్చని పేర్కొంది. ఫోన్ పే బోల్ట్ ఫీచర్.. డివైస్ టోకనైజేషన్ టెక్నాలజీపై పనిచేస్తుంది. యూజర్లు తమ వీసా లేదా మాస్టర్ కార్డు వివరాలను ఫోన్ పే యాప్ లో ఒక్కసారి సేవ్ చేస్తే.. అంటే టోకనైజే చేస్తే చాలు. ఫోన్ పే పేమెంట్ గేట్ వే ఉన్న ఏ మర్చంట్ యాప్ లో అయినా మళ్లీ కార్డుల వివరాలను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల పేమెంట్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. యూజర్ ను మరో పేజీకి రీడైరెక్ట్ చేసే అవసరం కూడా ఉండదు. పేమెంట్స్ డ్రాప్ అవుట్ సమస్య కూడా తగ్గుతుంది. ఫలితంగా వ్యాపారుల సక్సెస్ రేటు పెరుగుతుంది.






