- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Paramount: వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కొనుగోలుకు బిడ్ వేసిన పారామౌంట్
దీనికోసం పారామౌంట్ సంస్థ 108.4 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 9.77 లక్షల కోట్ల)కు బిడ్ వేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసేందుకు ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలోకి ఇప్పుడు హాలీవుడ్ నిర్మాణ సంస్థ పారామౌంట్ స్కైడాన్స్ ప్రవేశించింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కోసం సోమవారం కంపెనీ టెకోవర్ బిడ్‌ను దాఖలు చేసింది. దీనికోసం పారామౌంట్ సంస్థ 108.4 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 9.77 లక్షల కోట్ల)కు బిడ్ వేసింది. ఈ ఆఫర్ వార్నర్ బ్రదర్స్ కంపెనీ విలువను అప్పులతో సహా నిర్ణయించింది. అంతేకాకుండా ఈ మొత్తం నెట్‌ఫ్లిక్ ఒప్పందం చేసుకున్న రూ. 6.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ. అయితే, నెట్‌ఫ్లిక్స్ ఒక్కో షేర్ కోసం 27.75 డాలర్ల చెల్లించేందుకు సిద్ధమైంది. కానీ పారామౌంట్ ఆఫర్ మొత్తం వార్నర్ బ్రదర్స్ కోసం ఉద్దేశించింది. నెట్‌ఫ్లిక్స్ హాలీవుడ్ స్టూడియోలు, స్ట్రీమింగ్ వ్యాపారంపై మాత్రమే ఆసక్తి చూపించింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఒక్కో షేర్ కొసం 30 డాలర్లు చెల్లించేందుకు పారామౌంట్ సిద్ధమైంది. అయితే ఈ ఒప్పందం భారీ యాంటీట్రస్ట్ పరిశీలనను ఎదుర్కోవలసి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌కు అనుకూలంగా వార్నర్ బ్రదర్స్ పరోక్షంగా విక్రయ ప్రక్రియకు సహకరిస్తోందని పారామౌంట్ ఆరోపిస్తోంది.






