- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pharma: పారాసిటమాల్ సహా పెరగనున్న ఔషధాల ధరలు
కొన్ని రకాల ఔషధాల తయారీలో కీలకమైన ముడిపదార్థాల ఖర్చులు భారం కావడంతో త్వరలో ధరలు పెరిగే అవకాశం ఉందని ఫార్మా పంపిణీదారులు తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు దేశ ఆరోగ్య రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. కొన్ని రకాల ఔషధాల తయారీలో కీలకమైన ముడిపదార్థాల ఖర్చులు భారం కావడంతో త్వరలో ధరలు పెరిగే అవకాశం ఉందని ఫార్మా పంపిణీదారులు తెలిపారు. విశాఖపట్నం కెమిస్ట్స్ అసోసియేషన్ ప్రకారం, దుబాయ్ లాంటి పశ్చిమాసియా ప్రాంతం నుంచి దిగుమతి అయ్యే ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏపీఐల సరఫరా అంతరాయాలతో పాటు పెట్రోకెమికల్ సాల్వెంట్ ఖర్చులు, రవాణా, ఇంధన ధరల పెరుగుదల ప్రభావం వల్ల పెంపు తప్పదు. దేశీయ ఫార్మా పరిశ్రమ చైనా, మధ్యప్రాచ్యంపై ఆధారపడటం వల్ల ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీనివల్ల జ్వరం, నొప్పికి ఎక్కువగా వాడే పారాసిటమాల్, యాంటీబయాటిక్స్, డయాబెటిక్ మందులు, బీపీ, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కొన్ని ప్రత్యేక ఔషధాల ధరలు పెరుగుతాయని విశాఖ కెమిస్ట్స్ అసోసియేషన్ మాజీ బోర్డు సభ్యుడు నవీన్ చెప్పారు.
ఇవి ఎక్కువగా రోజువారీ వినియోగంలో ఉండే 'జెనరిక్' మందులు కావడం వల్ల సాధారణ ప్రజలపై ప్రభావం ఉండనుంది. పరిశ్రమ అంచనాల ప్రకారం, సాధారణ జెనరిక్ మందుల ధరలు 15-20 శాతం, కొన్ని ప్రత్యేక బ్రాండ్‌లు 30-40 శాతం, పారాసెటమాల్ వంటి కీలక ముడి పదార్థాల ధరలు దాదాపు 96 శాతం వరకు పెరగనున్నాయి. అయితే, ప్రస్తుతానికి మందుల కొరత లేదని హోల్‌సేల్ అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి. పాత స్టాక్ సాధారణ ధరలకే విక్రయిస్తున్నామని, కొత్త స్టాక్ విషయంలో హోల్ సేలర్లకు కంపెనీలు ధరల గురించి సంకేతాలిచ్చాయని పేర్కొన్నారు.






