PAN: ఏప్రిల్ 1 నుంచి ఆధార్‌తో పాన్ కార్డు దరఖాస్తు బంద్

by S Gopi |

ఇప్పటివరకు ఉన్న ఈ ప్రక్రియకు ముగింపు పలికి, ఇతర డాక్యుమెంట్ల అవసరాలను అవసరాలను కఠినతరం చేశారు.

PAN: ఏప్రిల్ 1 నుంచి ఆధార్‌తో పాన్ కార్డు దరఖాస్తు బంద్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) దరఖాస్తులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీనివల్ల ప్రస్తుతం కేవలం ఆధార్‌తో మాత్రమే పాన్ కార్డు కోసం చేసే దరఖాస్తులను తిరస్కరించనున్నారు. ఇప్పటివరకు ఉన్న ఈ ప్రక్రియకు ముగింపు పలికి, ఇతర డాక్యుమెంట్ల అవసరాలను అవసరాలను కఠినతరం చేశారు. కేవలం ఆధార్ ఉపయోగించి పాన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ మార్చి 31తో ముగుస్తుంది. దీనికి సంబంధించి బుధవారం కేంద్ర కామన్ సర్వీస్ సెంటర్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. బ్యాంకింగ్ సహా కీలక ఆర్థిక అవసరాలకు కీలకమైన పాన్ కోసం అప్లై చేసే వారు ఏప్రిల్ 1 నుంచి ఆధార్ కార్డుతో పాటు అదనంగా కొన్ని డాక్యుమెంట్లను ఇవ్వాలని పేర్కొంది. అవి, పుట్టినరోజును ధృవీకరించే బర్త్ సర్టిఫికేట్‌తో పాటు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, మెట్రిక్యూలేషన్ సర్టిఫికేట్, పాస్ పాఓర్ట్ లాంటివి ఏవైనా సమర్పించాలి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత పాన్ కార్డు కోసం చేసే దరఖాస్తు ఫారాలు కూడా మారుతాయని కామన్ సర్వీస్ సెంటర్స్ స్పష్టం చేసింది. తక్షణం ఈ-పాన్ కావాలనుకునే వారు ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ నుంచి పొందవచ్చని వెల్లడించింది.

Next Story