- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Padma Awards: మారుతీ సుజుకి ఛైర్మన్ ఒసాము సుజుకీకి 'పద్మ విభూషణ్' పురస్కారం
తమిళనాడుకు చెందిన టెక్స్‌టైల్స్ వ్యాపారవేత్త నల్లి కుప్పుస్వామి శెట్టికి పద్మభూషణ్

దిశ, బిజినెస్ బ్యూరో: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేయగా, వారిలో ఎనిమిది మంది వ్యాపార రంగానికి చెందినవారున్నారు. జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ సుజుకి వ్యవస్థాపకులు ఒసాము సుజుకికి పద్మ విభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది. ఆయన ఇటీవలే 94 ఏళ్ల వయసులో మరణించారు. అంతర్జాతీయ వాహన మార్కెట్లో సుజుకీని చిరస్థాయిగా నిలిపిన ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా సుజుకి సంస్థకు సేవలందించారు. ముఖ్యంగా జపాన్ ఆటో కంపెనీని ప్రపంచ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లో కీలకంగా మార్చారు. అలాగే, తమిళనాడుకు చెందిన టెక్స్‌టైల్స్ వ్యాపారవేత్త నల్లి కుప్పుస్వామి శెట్టి, గుజరాత్‌కు చెందిన కాడిలా హెల్త్‌కేర్ ఛైర్మన్ పంకజ్ పటేల్‌లకు పద్మభూషణ్, ఎస్‌బీఐ మాజీ ఛైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య, పంజాబ్‌కు చెందిన ఓంకార్ సింగ్ పహ్వా-అవాన్ సైకిల్, పవన్ గోయెంకా-ఎంఅండ్ఎం మాజీ ఎండీ(పశ్చిమ బెంగాల్), ప్రశాంత్ ప్రకాష్-గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ సంస్థ యాక్సెల్ పార్టనర్స్ కో-ఫౌండర్(కర్ణాటక), ఆర్జీ చంద్రమోహన్- హాట్సన్ ఆగ్రో ఛైర్మన్(తమిళనాడు), సజ్జన్ భజంకా-సెంచూరీ ప్లైబోర్డ్స్ ఫౌండర్(పశ్చిమ బెంగాల్), సాలి హోల్కర్-ఇండోర్ రాజకుంటుంబానికి చెందిన బ్రిటీష్-ఇండియన్ వ్యాపారవేత్త(మధ్యప్రదేశ్) ఉన్నారు.






