- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Oyo: భారత్‌లో యూరప్ హాలిడే హోమ్ బ్రాండ్ 'డాన్‌సెంటర్' సేవలను ప్రారంభించిన ఓయో
కస్టమర్లకు తమ వెకేషన్ సమయంలో ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒరావెల్ స్టేస్ వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ట్రావెల్ కంపెనీ ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్ తన యూరోపియన్ హాలిడే హోమ్ బ్రాండ్ డాన్‌సెంటర్‌ను బుధవారం భారత మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. నార్త్ గోవాలోని సియోలిమ్‌లో విలాసవంతమైన విల్లాలతో దీన్ని ప్రారంభించింది. దేశంలో కొత్తగా నిర్మించిన ప్రాపర్టీలను మాత్రమే వెకేషన్‌కు అందుబాటులో ఉంచాలని డాన్‌సెంటర్ నిర్ణయించింది. కస్టమర్లకు తమ వెకేషన్ సమయంలో ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒరావెల్ స్టేస్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దీనికోసం గోవాలో ప్రీమియం సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లను ప్రారంభించేందుకు రియల్ ఎస్టేట్ దిగ్గజం ప్రావిడెంట్ గ్రూప్‌తో చర్చలు జరుగుతున్నాయని కంపెనీ స్పష్టం చేసింది. భారత్‌లో లగ్జరీ హాలిడే హోమ్ రెంటల్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. అందుకే వెకేషన్, లగ్జరీకి కేంద్రంగా ఉండే గోవాలో డాన్‌సెంటర్ కార్యకలాపాలను మొదటగా ప్రారంభించామని ఒరావెల్ స్టేస్ లగ్జరీ బిజినెస్ హెడ్ ఆదిత్య శర్మ చెప్పారు. యూరప్‌కు చెందిన డాన్‌సెంటర్‌ను 2019లో ఓయో కొనుగోలు చేసింది. అప్పటినుంచి ఓయో కంపెనీ యూరప్ ప్రాంతంలో తన ఉనికిని క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం భారత ట్రావెలర్లు కేవలం వసతిని మాత్రమే కాకుండా సరైన సౌకర్యం, విలాస, నాణ్యతతో కూడిన అనుభవాన్ని కోరుకుంటున్నారు. యూరప్‌లో ఆరు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న డాన్‌సెంటర్ వెకేషన్ సేవలను భారత్‌లో ప్రారంభించడం సంతోషంగా ఉందని డాన్‌సెంటర్ ఇండియా బిజినెస్ హెడ్ అర్జున్ సింగ్ పేర్కొన్నారు.






